BigTV English

Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గులాబీదళంలో మొదలైన గుబులు

Medak BRS MLA’s : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గులాబీదళంలో మొదలైన గుబులు

Medak BRS MLA’s : ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మంగళవారం నాడు ముఖ్యమంత్రి నివాసంలో ఎమ్మెల్యేలు సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి , కొత్తప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్‌రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవడంతో సర్వత్రా చర్చకు దారితీసింది.


ఈ భేటీకి సంబంధించి కొత్త ప్రభాకర్‌ అపాయింట్‌మెంట్‌ తీసుకోగా.. మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. అయితే తాము మర్యాద పూర్వకంగానే కలిసినట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి వద్ద గన్‌మెన్ల అంశాన్ని కొత్త ప్రభాకర్‌ రెడ్డి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం గత సర్కారు హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై విచారణ జరుపుతోంది. అక్రమాలు తేలితే బీఆర్ఎస్ బడా నేతలు జైలుకే అంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కాంగ్రెస్ మంత్రులు గత కొద్ది రోజులుగా చెబుతూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రీసెంట్ గానే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు భేటీ కావడం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తుంది.


.

.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×