BigTV English

MEDAK: మెదక్ జిల్లాలో వరుస హత్యల కలకలం…ఘటనలపై అనుమానాలు!

MEDAK: మెదక్ జిల్లాలో వరుస హత్యల కలకలం…ఘటనలపై అనుమానాలు!

మెద‌క్ జిల్లాలో వ‌రుస హత్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. గత నెల 23న చిన్నశంకరంపేట ప్రభుత్వాసుపత్రి వద్ద గుర్తు తెలియని యువకుడిని బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి హత్య చేశారు. ఈ ఘ‌ట‌న మ‌ర‌వ‌కముందే మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ రోజు పద్మనాభస్వామి గుట్ట వద్ద బండరాయితో కొట్టి పెట్రోల్ పోసి మ‌రో యువకుడిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు హత‌మార్చారు. కేవ‌లం 10 రోజుల వ్యవధిలోనే ఈ ఇద్దరి దారుణ హత్యలు జిల్లాలో ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.


ALSO READ: అప్పులు తేవడంలో మీది ప్రపంచ రికార్డు..బండిపై పొన్నం ఫైర్!

రెండు హ‌త్య‌లు ఒకే విధంగా ఉండ‌టంతో ఇద్ద‌రినీ ఒకే వ్య‌క్తి చంపి ఉంటార‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ఎస్పీ ఉద‌య్ కుమార్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ…గ‌త నెల 23వ తేదీన కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంద‌ని అన్నారు. ఆ డెడ్ బాడీని ప్రిజ‌ర్వ్ చేశామ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు ఆ బాడీ ఎవ‌రిదో గుర్తించ‌లేద‌ని చెప్పారు. ఈ ప్రాంతంలో కంపెనీలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అన్నారు. గ‌తంలో చనిపోయిన వ్య‌క్తి స్థానికుడు కాద‌ని అనుమానిస్తున్న‌ట్టు తెలిపారు.


ఇప్పుడు చ‌నిపోయిన వ్య‌క్తికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు దొర‌క‌లేద‌ని, ఇత‌ను కూడా స్థానికుడు కాక‌పోవ‌చ్చ‌ని అన్నారు. గ‌త హ‌త్య స‌మ‌యంలో సీసీ కెమెరాలు ప‌రిశీలిస్తే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసివ‌చ్చిన‌ట్టు గుర్తించామ‌ని కానీ నింధితుడు ఇంకా ప‌ట్టుబ‌డ‌లేద‌న్నారు. ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే టీమ్స్ రంగంలోకి దిగాయ‌ని, నింధితుడిని క‌చ్చితంగా ప‌ట్టుకుని తీరుతామ‌ని హామీ ఇచ్చారు. స్థానికులు జాగ్రత్త‌గా ఉండాల‌ని సూచించారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×