BigTV English

Sri Reddy: వైసీపీకి గుడ్ బై చెప్పిన శ్రీరెడ్డి.. లేఖ విడుదల.. సారీల పర్వంలో ఈసారి కొత్త పేర్లు.. వారెవరంటే?

Sri Reddy: వైసీపీకి గుడ్ బై చెప్పిన శ్రీరెడ్డి.. లేఖ విడుదల.. సారీల పర్వంలో ఈసారి కొత్త పేర్లు.. వారెవరంటే?

Sri Reddy: శ్రీరెడ్డి మరో మారు సారీల పర్వం సాగించారు. ఈ సారి తాను వైసీపీకి దూరం కానున్నట్లు ప్రకటించి, మళ్లీ లోకేష్ అన్నా.. కాస్త జాలి చూపన్నా అంటూ ప్రాధేయ పడ్డారు. మొన్న సారీలు చెబుతూ.. వీడియో విడుదల చేసిన శ్రీ రెడ్డి, ఈసారి లేఖను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈమె నోటిమాట వచ్చిందంటే చాలు అన్నీ బూతులేనంటారు టీడీపీ, జనసేన అభిమానులు. అసలు తన మాటలను తూటాలుగా వదులుతూ వైరల్ గా మారిన సినీనటి శ్రీరెడ్డి తెలియని వారుండరు. వైసీపీ జోలికి వచ్చినా, మాజీ సీఎం జగన్ ను ఒక్క మాట విమర్శించినా నేను రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో ఎవరైనా శ్రీ రెడ్డి తరువాతే.

అలాంటి శ్రీ రెడ్డి పలుమార్లు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. కానీ మొన్న ఒక్కసారిగా ఉన్నట్లుండి అందరికీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు శ్రీరెడ్డి. తాజాగా మరో లేఖను కూడా విడుదల చేసి, వైసీపీ కి గుడ్ బై చెప్పేశారు.


శ్రీరెడ్డి లేఖ ఆధారంగా.. ముందుగా మాజీ సీఎం జగన్, భారతీలకు మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లేదంటూ.. టీవిలో చూసి తాను ఆనందిస్తానన్నారు. తాను వైసీపీ కి చెడ్డ పేరు తీసుకువచ్చినట్లు, చివరికి పార్టీలో సభ్యురాలిని కాకపోయినా తన వాణి బలంగా వినిపించనన్నారు. అయితే తన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం జరుగుతుందని తాను అనుకోలేదని, ఇప్పుడు అసలు విషయాన్ని గ్రహించి పార్టీకి పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే మంత్రి నారా లోకేష్ కు సైతం అన్నా అంటూ సంబోధిస్తూ తన ఇష్టమైన దైవం పై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇక ఎప్పుడూ ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనంటూ మరో మారు సారీల పర్వం సాగించారు. గత వారం రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా బాధతో కుమిలిపోతున్నట్లు, తనతో పాటు తన కుటుంబ సభ్యులు అనుభవించిన క్షోభ వేల సంవత్సరాలకు సరిపడా అనుభవించినట్లు, ఇప్పటికైనా తమను వదిలివేయాలని కోరారు.

ఇటీవల సారీ చెబుతూ వీడియో విడుదల చేయడం వెనక తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు, ఇంకా ఎవరి పేరునైనా మరిచిపోయి ఉంటే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు కోరారు. చివరగా వైఎస్ షర్మి;ళ, సునీతలకు కూడా మీరు కూడా క్షమాపణలు స్వీకరించండి అంటూ కోరుతూ.. సినిమాలపరంగా తాను ఫెయిల్ అయ్యానని, అలాగే పాలిటిక్స్ పరంగా కూడా తాను ఫెయిల్ అయినట్లు శ్రీరెడ్డి లేఖలో పేర్కొన్నారు. తాజాగా టిడిపి మహిళా కార్యకర్తలు బుధవారం శ్రీరెడ్డి పై మరో ఫిర్యాదు చేయడం విశేషం.

కానీ ఈసారి లేఖలో కొత్త పేర్లను చేర్చారు శ్రీరెడ్డి. మొన్న వీడియోలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తల్లికి సారీ చెప్పిన శ్రీరెడ్డి, ఈసారి చిరంజీవి, నాగబాబు, వైఎస్ షర్మిళ, వైఎస్ సునీత పేర్లను కూడా చేర్చారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×