E-Paper
Advertisement

ఆగమైతున్న హైదరాబాద్.. నిరసన పేరిట వేల లీటర్ల నీరు వృథా.. రగిలిపోతున్న ప్రజలు!

ఆగమైతున్న హైదరాబాద్.. నిరసన పేరిట వేల లీటర్ల నీరు వృథా.. రగిలిపోతున్న ప్రజలు!
Advertisement

Water Wastage: ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో నీటి కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ లో నీటి ఎద్దడి తలెత్తి నగరవాసులు అల్లాడుతున్నారు. చుక్క నీటి కోసం చాలామంది పరితపిస్తున్నారు. ఇలాంటి సమయంలో వందల లీటర్ల కొద్దీ నీరు రోడ్లపాలు కావడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది. హైదరాబాద్‌లో మంగళవారం ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన బంద్.. విచిత్రమైన టర్న్ తీసుకుంది. నిరసనల్లో పాల్గొన్న కొందరు వాటర్ ట్యాంకర్లను అడ్డుకొని నీటిని రోడ్డుపైకి వృథాగా వదిలేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

నిరసనల నేపథ్యం ఏంటంటే?

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగర పరిధిలో ముఖ్యంగా చెరువుల సమీపంలో ఉన్న అక్రమ బోర్లను హైడ్రా, రెవెన్యూ అధికారులు సీజ్ చేస్తున్నారు. దీంతో తమ జీవనోపాధి దెబ్బతింటోందని, తీవ్ర నష్టాలు వస్తున్నాయని ప్రైవేటు వాటర్ ట్యాంకర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసి మంగళవారం బంద్ కు సైతం పిలుపునిచ్చింది.

నిరసన పేరుతో.. నీళ్లు రోడ్డుపాలు

Advertisement

అయితే బంద్‌ను ధిక్కరించి రోడ్లపైకి వచ్చిన ఇతర ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లను అడ్డుకుని వాటిలోని వేల లీటర్ల నీటిని రోడ్డుపైనే పారబోయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎల్ నినో ఎఫెక్ట్‌తో రాబోయే రోజుల్లో నీటి కష్టాలు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే కళ్లముందే వేల లీటర్ల మంచి నీరు మురికి కాల్వల పాలవ్వడంపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి వృథా దృశ్యాలను చూసి రగిలిపోతున్నారు.

Also Read: బ్యాంక్ ఎఫ్‌డీల కన్నా ఎక్కువ లాభం కావాలా? రిస్క్ లేకుండా అధిక వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకాలు ఇవే!

నిరసన ఓకే.. కానీ ఈ వృథా ఏంటి?

Advertisement

అయితే ప్రభుత్వ చర్యలపై నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎంతో విలువైన నీటిని ఇలా రోడ్లపై పారబోసి నిరసన తెలపడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలను ప్రజలు లేవనెత్తుతున్నారు. ఒకవైపు తాగునీరు దొరక్క ఆపార్ట్‌మెంట్లు, బస్తీల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ నీటి వృథా ‘అగ్నికి ఆజ్యం పోసినట్లు’గా మారింది. ప్రజలకు ప్రాణాధారమైన నీటిని ఇలా వృథా చేయకూడదని కొందరు చెబుతుంటే.. వృథా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ…! ఈ రాష్ట్రాల్లో జనాలకు సీఎంలు భయపడాల్సిందే.. జవాబుదారీ పాలన అందివ్వాల్సిందే!

Tags

Related News

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి!

అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్ నంబర్ వన్.. జగదీశ్ రెడ్డికి యెన్నం శ్రీనివాస్ కౌంటర్!

సదర్ సమ్మేళనంలో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు!

హైదరాబాద్ ED బిగ్ ఆపరేషన్.. అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు!

మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!

ఎంపీలో తెలంగాణ యువతి ఆత్మహత్య.. బీటెక్ థర్డ్ ఇయర్, వెలుగులోకి షాకింగ్ విషయాలు,

చిల్లర వివాదం.. మహిళా కండక్టర్ మృతి.. నిందితురాలిపై హత్య కేసు నమోదు!

Big Stories

Advertisement
×