E-Paper
Advertisement

మంత్రి కొండా సురేఖ వివరణ.. మా ఇంట దైవం, కట్.. పేస్ట్ మాదిరిగా చేశారంటూ మండిపాటు

మంత్రి కొండా సురేఖ వివరణ..  మా ఇంట దైవం,  కట్.. పేస్ట్ మాదిరిగా చేశారంటూ మండిపాటు
Advertisement

Hyderabad: తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారా? శ్రీరాముడిపై ఆమె చేసిన వ్యాఖ్యల వ్యవహారం రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారిందా? దీంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పలువురు నేతలు టార్గెట్ చేశారా? పరిస్థితి గమనించిన ఆమె, దిద్దుబాటు చర్యలు చేపట్టారా? ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ.

శ్రీరాముడి వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ

Advertisement

మంత్రి కొండా సురేఖ రీసెంట్‌గా శ్రీరాముడిపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై విపక్షాల ఎదురుదాడి మొదలైంది. ఆమె దేవాదాయశాఖ మంత్రి కాదని, దైవ ద్రోహ శాఖ మంత్రి తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. పరిస్థితి గమనించిన ఆమె, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అని తాను అన్న విషయాన్ని కొందరు తప్పుదోవ పట్టించారని అన్నారు సదరు మంత్రి. తాను చెప్పింది మొత్తం పక్కనపెట్టి, శ్రీరాముని అంశాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనకు రామాయణం తెలుసని, తన ఇంట దైవం శ్రీరాముడేనని అన్నారు.

Advertisement

మా ఇంట దైవం శ్రీరాముడు,  కట్.. పేస్ట్ మాదిరిగా చేసి ప్రచారం చేశారంటూ మండిపాటు

మేమంతా హిందువులమేనని, అందుకే ఇంట్లో నుండి బయటకు వచ్చే ముందు దేవుణ్ణి మొక్కుకొని, బొట్టు పెట్టుకొని బయటకు వస్తానని గుర్తు చేశారు. మా దగ్గర భద్రాచలం ఉందని, రాముని కోసం మా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏకంగా రూ. 300 కోట్లు ఇచ్చారని అన్నారు. మీరు కనీసం రూ.700 కోట్లు ఇచ్చి శ్రీరాముని భక్తి నిరూపించుకోవాలని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.

ఏదో విమర్శలు చేసి తాను శ్రీరాముడిని తిట్టినట్లు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. తాను అన్న మాటల సందర్భం వేరని, మీరు ప్రచారం చేసింది మరొకటని వివరించే ప్రయత్నం చేశారు. ప్రజల గురించి, రైతుల గురించి పట్టని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిపారు.

ALSO READ: కాన్వాయ్ ఆంక్షలకు చెక్.. సామాన్యుడిలా ట్రాఫిక్‌లో సీఎం రేవంత్ రెడ్డి

సమాధానం చెప్తే చెప్పాలని లేకుంటే సైలెంట్‌గా ఉండాలన్నారు. అంతేగానీ తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. మొత్తానికి మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇవ్వడంతో శ్రీరాముడి వ్యాఖ్యలపై వివాదం దాదాపు సద్దు మణిగిపోయినట్టే.

 

 

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×