Konda Surekha: తెలంగాణలో అరుదైన పార్క్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి కొండా సురేఖ. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఎకో పార్క్, కాటేజీలను ప్రారంభించారామె. పర్యావరణ పరిరక్షణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అన్నారు. ఎకోపార్క్ వంటి ప్రాజెక్టుకు కొత్త తరానికి స్ఫూర్తిని అందించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు. హాలిడేస్‌లలో పిల్లాపాపలతో కలిసి పార్క్‌లను సందర్శించాలని తల్లితండ్రులకు సూచించారు మంత్రి కొండా సురేఖ.
ఎకో పార్క్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్న ఎంపీ రఘునందన్ రావు..
ఎకో పార్కును పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు ఎంపీ రఘునందన్ రావు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలని, కాలుష్యం తగ్గించాలన్నారు. అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు ఎంపీ రఘునందన్ రావు.
అటవీ ప్రాంతం నర్సాపూర్ నియోజకవర్గానికి.. ఓ వరం అంటూ అభివర్ణించిన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి..
నర్సాపూర్ నియోజకవర్గానికి అటవీ ప్రాంతం ఓ వరం అన్నారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. పార్క్ వల్ల ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు వస్తుందన్నారు. సెలవుల్లో కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఈ పార్క్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
చుట్టూ 4300 ఎకరాల అటవీ ప్రాంతం.. 600 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎకో పార్క్
చూసేందుకు చాలా ప్రశాంతంగా కన్పిస్తుంది నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్. 4 వేల 300 ఎకరాల అటవీ ప్రాంతంలో ఇది 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్క్ ఉన్న ప్రాంతంకు పక్కనే సుందరమైన సరస్సు, ఆహ్లాదరకమైన వాతావణం కన్పిస్తుంది. ఇక్కడే 21 కుటీరాలు, పర్యావరణ విద్యా కేంద్రం, ఆటలు ఆడేందుకు ఏర్పాట్లు, పూల్.. ఇంకా మరెన్నో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. టూరిస్టుల కోసం రెస్టారెంట్లు అందుబాటులో ఉంచారు.