Bigg Boss 9 Promo: బిగ్ బాస్.. బుల్లితెర ఆడియన్స్ ను అలరించడమే కాకుండా మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతూ అటు సెలబ్రిటీలకు కూడా ఊహించని పాపులారిటీ అందిస్తోంది. భిన్న విభిన్నమైన టాస్కులతో అటు కంటెస్టెంట్స్ కు ముప్పతిప్పలు పెట్టడమే కాకుండా ఇటు ప్రేక్షకులలో కూడా సరికొత్త ఆసక్తిని నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తెలుగులో 9వ సీజన్ ప్రారంభం అయింది. అందులో భాగంగానే 8 వారాలు ఈరోజుతో పూర్తి కాబోతున్నాయి. ఇక్కడ సాధారణంగా వీకెండ్స్ అనగానే హోస్ట్ నాగార్జున విచ్చేసి కంటెస్టెంట్స్ తప్పులను బయట పెడుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే తాజాగా 56వ రోజుకు సంబంధించి రెండవ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు.
కాసేపటి క్రితం మొదటి ప్రోమో విడుదల చేయగా ఇందులో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మందన్న తో పాటు ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కూడా వచ్చి సందడి చేశారు. అటు కంటెస్టెంట్స్ తో ఈ టీం ముచ్చటించి ఎన్నో విషయాలను పంచుకున్నారు అయితే ఇప్పుడు రెండవ ప్రోమోలో ఏముంది అనే విషయానికి వస్తే.. నిత్యం టిఫిన్, భోజనం , కాఫీ దగ్గర గొడవలు పెట్టుకుంటూ వారంలో ఏడు రోజులు ఉంటే రోజుకు ఐదు సార్లు చొప్పున మొత్తం 35 సార్లు గొడవ పడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న తనుజాకి గట్టిగా ఇచ్చి పడేశారు హోస్ట్ నాగార్జున. తప్పు నీలో ఉందా ? అందరిలో ఉందా? అంటూ ప్రశ్నిస్తూ ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
ALSO READ:Vyjayanthi Movies: రైట్స్ అన్ని లోకల్ వాళ్లకే… అందరూ ఈ నిర్మాతల ఉండాలి
ఇక ప్రోమో విషయానికి వస్తే.. రోజుకు మూడుసార్లు భోజనం రెండుసార్లు టీ.. మొత్తం ఐదు సార్లు వారానికి 35 సార్లు.. ప్రతిసారి కూడా నువ్వు కంటెస్టెంట్స్ తో గొడవ పడుతూ అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నావు. తప్పు నీదా లేక అందరిదీనా అని ప్రశ్నించగా తప్పు అందరిలో ఉంది సార్ నాలో కూడా అంటూ సమాధానం ఇచ్చింది తనూజ. తనూజ మాట్లాడుతూ.. నాకు కిచెన్ డిపార్ట్మెంట్ ఇవ్వద్దు అని వేడుకున్నాను . ఇస్తే కొంతమంది నన్ను టార్గెట్ చేస్తారు అని కూడా చెప్పాను. అయినా నాకు కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు అని నాగార్జునతో చెబుతుండగా ఇమ్మానుయేల్ మధ్యలో కలగజేసుకొని అసలు ఆ మాట తను చెప్పలేదు అని ఇమ్మానియేల్ చెబుతుండగానే.. చెప్పాను సార్ అంటూ దబాయించింది తనూజ. అయితే వెంటనే రేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన మాధురి మాట్లాడుతూ తనుజ అలా చెప్పలేదు అని చెప్పింది.
ఇకపోతే అబద్ధం అని తెలుసుకున్న నాగార్జునతో మాట్లాడుతూ.. ఒక రోల్ మనం ఒప్పుకున్న తర్వాత.. మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి సహనం.. రెండవది మాట్లాడే విధానం.. మరొకటి ఇతరులు ఇచ్చే సలహాలు తీసుకోవడం. ఇతరుల నుండి సలహాలు తీసుకోవడం మర్చిపోతే జీవితంలో మార్పు రావడం అసంభవం. అంటూ తనూజాకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మరి ఇకనైనా తనూజ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మారుతుందేమో చూడాలి.