Konda Surekha on CM Chandrababu: కరుణ ఉంటేనే తప్ప తిరుమలలో శ్రీవారిని దర్శనం దొరకదు. మనం ఎన్ని అనుకున్నా.. ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. తిరుమల దర్శనానికి రోజు రోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. కాకపోతే అక్కడికి వెళ్లిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరికి దర్శనం టికెట్లు దొరికితే.. కొందరికి రూమ్‌లు దొరికిన సందర్భాలు లేవు. కేవలం సిఫార్సుల లేఖలు వారికి మాత్రమే ఆ ఛాన్స్ ఉందని కొందరు నమ్ముతున్నారు. ఇక అసలు విషయానికొద్దాం.
సీఎం చంద్రబాబు లేఖలో కీలక అంశాలు
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం సిఫార్సు లేఖల వ్యవస్థను తిరిగి తీసుకువచ్చినందుకు ప్రభుత్వం తరపున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కాకపోతే కొన్ని కీలక విషయాలు ఆ లేఖలో రాసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ నుండి తిరుమల సందర్శించే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందన్నారు.
టీటీడీ అధికారులు తెలంగాణ భక్తులను అనుమతించకపోవడంపై తీవ్ర గందరగోళం నెలకొంటుందన్నారు. ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు సదరు మంత్రి కొండా సురేఖ. ముఖ్యమంత్రి ఆదేశాలను టీటీడీ అధికారులు సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా తెలంగాణ ప్రజల భక్తి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిపై ఏమాత్రం తగ్గలేదన్నారు.
ముఖ్యంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం లభించక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు పేర్కొన్నారు. సదరు ఆదేశాలను సక్రమంగా పాటించేలా టీటీడీ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు మంత్రి కొండా సురేఖ. ఈ విషయమై సీఎం చంద్రబాబు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ప్రస్తావించారు ఆమె.
ALSO READ: సభలో మన వ్యూహం ఇదే
భక్తుల ఆవేదన ఇదే
అన్నట్లు ఈ మధ్యకాలంలో రూ. 300 దర్శనం టికెట్లు లభించిన వాళ్లకు తిరుమలలో కనీసం రూములు దొరకలేదు. భక్తుల దర్శనంపై దృష్టి పెట్టిన టీటీడీ.. అక్కడి రూములపై ఏమాత్రం దృష్టి పెట్టలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తిరుమల వెళ్లిన భక్తులు స్వయంగా తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. కనీసం ఒక్కరోజైనా తిరుమల శ్రీవారి సన్నిధిలో గడిపే అదృష్టం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టికెట్ల బుకింగ్ ఇంత ఘోరమా?
టికెట్ల బుకింగ్ సమయంలో నాలుగైదు ఆప్షన్లు చూపిస్తున్నాయి. వాటికి క్లిక్ చేస్తే మళ్లీ మొదటికి రావడం మొదలు పెట్టింది. ఈలోగా అక్కడ కేటాయించిన సమయం గడిచిపోతోందని అంటున్నారు. ఈ క్రమంలో చాలామంది తిరుమల దర్శనాలు క్యాన్సల్ చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. దయచేసి ఈ పద్దతిని తొలగించి కనీసం జిల్లా కేంద్రాల్లో ఆఫ్‌లైన్ పద్దతి పెట్టాలని కోరినవాళ్లు లేకపోలేదు. మరికొందరైతే వాట్సాప్ పద్దతి పెడితే బాగుంటుందని కోరుతున్నారు.
ఎప్పుడైనా దర్శనం
ఇక రూ. 300 దర్శనాల విషయానికొద్దాం. ఒకప్పుడు ఏ సమయంలో బుకింగ్ చేసుకుంటే అప్పుడు మాత్రమే దర్శనం చేసుకునేవారు భక్తులు. ఇప్పుడు అలా కాకుండా మార్నింగ్ దర్శనం చేసుకోలేని వారు సాయంత్రం సమయంలో దర్శనానికి వస్తున్నారు. దీనివల్ల రద్దీ పెరిగి పోవడంతో రూ.300 టికెట్ల విషయంలో దర్శనానికి నాలుగైదు గంటల సమయం పడుతుందని అంటున్నారు భక్తులు.