OTT Movie : భయపెడుతూ ఎంటర్టైన్ చేసే సినిమాలు ఉన్నాయంటే అవి హారర్ సినిమాలు మాత్రమే. ఈ సినిమాలకు ఫాన్స్ ఎక్కువగానే ఉన్నా, ఒంటరిగా మాత్రం చూడటానికి భయపడుతుంటారు. రాత్రిపూట వీటి జోలికి పోయే సాహసం చాలామంది చేయరు. అటువంటి భయపెట్టే సినిమాలను మనవాళ్లు కూడా బాగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే హాలీవుడ్ మూవీలో దయ్యం కనిపించే సీన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఒక అడుగు ముందుకు వెళ్లి పేషంట్ తో రోజు రొమాన్స్ కూడా చేస్తుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గోతిక’ (Gothika). ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీకి మాథ్యూ కస్సోవిట్జ్ దర్శకత్వం వహించారు. హాలీ బెర్రీ రాబర్ట్ డౌనీ జూనియర్, పెనెలోప్ క్రూజ్, చార్లెస్ ఎస్. డట్టన్, జాన్, ఇందులో నటించారు. ఈ మూవీ తన భర్తను దారుణంగా హత్య చేసిందని ఆరోపిస్తూ, ఆమె పనిచేసే పెనిటెన్షియరీలో నిర్బంధించబడిన మానసిక వైద్యురాలిని చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ అంతర్జాతీయంగా $141.6 మిలియన్లు వసూలు చేసింది. అయితే ఇది విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
హీరోయిన్ ఒక మెంటల్ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. పేషంట్లను పరీక్షిస్తూ ఉన్నప్పుడు, ఒక పేషెంట్ చెప్పే మాటలు విని ఆశ్చర్య పోతుంది. రాత్రి అయితే ఒక దయ్యం వచ్చి తనపై అఘాయిత్యం చేస్తోందని చెప్తుంది. డాక్టర్ ఆమె మాటలను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే, ఒక అమ్మాయి ఎదురుపడి హీరోయిన్ ని ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత లేచి చూస్తే తాను హాస్పిటల్ లో పేషెంట్ లా ఉంటుంది. జరిగిన విషయం తెలుసుకుని ఆశ్చర్య పోతుంది హీరోయిన్. ఎందుకంటే ఆమె భర్తను చంపినట్లు ఆధారాలు కూడా ఉంటాయి. నిజానికి ఆమె లోపల ఆత్మ ప్రవేశించి హీరోయిన్ భర్తను చంపేస్తుంది. ఇదంతా హీరోయిన్ చేసిందని, పోలీసులు అరెస్ట్ చేసి అదే హాస్పిటల్ లో బంధిస్తారు.
ఆ తర్వాత తనకు తరచూ కనబడుతున్న ఆత్మ ఎవరో తెలుసుకొని, ఆ అమ్మాయికి తన భర్త వల్ల జరిగిన అన్యాయం ఏమైనా ఉందేమో అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో ఆమె కొన్ని నిజాలు తెలుసుకుంటుంది. మరోవైపు అదే హాస్పిటల్లో బంధీగా ఉండే మరో అమ్మాయితో, ఒక దయ్యం ప్రతిరోజు రొమాన్స్ చేస్తుంటుంది. దీనిని కల్లారా చూసిన హీరోయిన్ భయంతో పారిపోతుంది. చివరికి హీరోయిన్ కి కనపడుతున్న ఆత్మ ఎవరు? ఆత్మ ప్రతిరోజు ఎందుకు అమ్మాయితో రొమాన్స్ చేస్తుంది? దయ్యం హీరోయిన్ భర్తని ఎందుకు చంపుతుంది?ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ‘గోతిక’ (Gothika) అనే ఈ మూవీని చూడండి.