EPAPER

Ex gratia Cheques: యువ శాస్త్రవేత్త అశ్వినీ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత

Ex gratia Cheques: యువ శాస్త్రవేత్త అశ్వినీ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్ అందజేత

Ex gratia Cheques to Young Scientist Ashwini Family: భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ లతో కలిసి బుధవారం అందజేశారు. కారేపల్లి మండలం గంగారాం తండాకు చెందిన మోతీలాల్, ఆయన కుమార్తె యువ శాస్త్రవేత్త అశ్వినీ వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయి మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించి ఒక వ్యక్తికి ఐదు లక్షల రూపాయల చొప్పున రు. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎక్స్‌గ్రేషియాతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, పత్రాన్ని అందజేశారు.


Also Read: బ్రేకింగ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ

అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అశ్వినీ మరణంతో దేశం, ప్రపంచం ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోయిందని అన్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోతీలాల్, అశ్విని చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. వరదల్లో కొట్టుకుపోయి మృతిచెందిన యువ శాస్త్రవేత్త కుటుంబానికి రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్ తోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.


Also Read: తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం భారీ విరాళం.. ఏపీ పంచాయతీలకు మరో రూ. 4 కోట్లు ?

Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×