Sundeep Kishan: ఏపీని వరదలు ముంచెత్తిన విషయం తెల్సిందే. వరదల్లో చిక్కుకొని ఎంతోమంది నిరాశ్రుయులు అయ్యారు. తిండి లేక అలమటిస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం తమ సాయశక్తులా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, వారికి ఫుడ్ ను అందించడానికి కష్టపడుతుంది.
ఇక ఇలాంటి విపత్తు సమయాల్లో సాయం అందించడానికి తెలుగు నటులు ఎప్పుడు ముందే ఉంటారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలందరూ.. రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఇక అందరిలా డబ్బులు విరాళంగా ఇవ్వకుండా.. తనవంతు సాయంగా ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు కడుపు నింపాడు కుర్ర హీరో సందీప్ కిషన్.
ఆహరం కోసం, నీళ్ల కోసం అలమటిస్తున్న ప్రజల వద్దకు తన టీమ్ ను పంపి.. వారి ఆకలిని తీర్చాడు. విజయవాడ లోని కొన్ని ప్రాంతాల్లో సందీప్ టీమ్ పర్సనల్ గా వెళ్లి.. వారికి ఆహారాన్ని అందించారు. సందీప్ నడుపుతున్న వివాహ భోజనంబు రెస్టారెంట్ నుంచి ప్రతిరోజు 300 మందికి సరిపడా ఫుడ్ ను పంచుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఈ విషయం తెలియడంతో సందీప్ ను నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. శభాష్ సందీప్.. మంచి పని చేస్తున్నావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తమ టీమ్ తో పాటు మిగతా యువత కూడా కదిలివచ్చి.. వరదల్లో చిక్కుకున్న వారికి సహాయంగా గా నిలబడితే.. సగం పరిస్థితి చక్కబడుతుందని కొందరు చెప్పుకొస్తున్నారు.
ఇక సందీప్ కెరీర్ గురించి చెప్పాలంటే .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతకు ముందులా కాకుండా సందీప్.. కథలను ఏరికోరి ఎంచుకుంటున్నాడు. హీరోగానే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. ఈ మధ్యనే రాయన్ సినిమాలో విలన్ గా కనిపించి మెప్పించిన సందీప్.. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమాలతో సందీప్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
Kuddos to @sundeepkishan anna Team👏🏻
Truly a Great initiative towards everyone…❤️#SundeepKishan #APFloods pic.twitter.com/RWYrkc5ArT
— Anchor_Karthik (@Karthikk_7) September 3, 2024