BigTV English

Heavy Rains: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

Heavy Rains: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులపై కలెక్టర్లకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

Minister Ponguleti on heavy rains(Latest news in telangana): రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలంటూ రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మరో 5 రోజులపాటు భారీ వర్షాలు కొనసాగుతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.


సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, నూతన రెవెన్యూ చట్టం -2024 ముసాయిదా, ధరణి దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ తదితర అంశాలపై తెలంగాణ చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే 5 రోజుల్లో వర్షాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక పరిస్థితులను బట్టి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే నిర్ణయాన్ని కలెక్టర్లు తీసుకోవాలని సూచించారు. గత రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా వీలైనంతమేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి గురించి మంత్రి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ప్రాంతాలలో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.


Also Read: తెలంగాణ జైళ్లు ‘హౌస్ ఫుల్’.. ఆ కేసుల్లో అరెస్టైన నేరస్తులే ఎక్కువ!

ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాన్నారు. ప్రతి కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏ విధమైన సహాయం కావాలన్నా రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకురాబోతున్న నూతన రెవెన్యూ చట్టం 2024పై ప్రజల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలని, అందులో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో ఆయా జిల్లాల్లో స్థానిక పరిస్థితులను బట్టి నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపై వివిధ రంగాల మేధావులతో వర్క్ షాప్ నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ధరణి సమస్యలపై గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులతోపాటు ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన దరఖాస్తులను వచ్చే పదిరోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాలని సూచించారు. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో దరఖాస్తుల పెండింగ్ అధికంగా ఉందని, ఆ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ను ఆదేశించారు.

లక్షాలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే లేఅవుట్ రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బంధీగా చర్యలు తీసుకోవాన్నారు. ఎల్ఆర్ఎస్ క్షేత్రస్థాయి తనిఖీల కోసం స్పెషల్ టీమ్ లతోపాటు హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు.

Also Read: సిద్ధిపేటలో టెన్షన్ వాతావరణం.. భారీగా మోహరించిన పోలీసులు

మొత్తం ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని సీఎస్ కు సూచించారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో అవసరమైన మేరకు డాక్యుమెంట్లు ఇవ్వని పక్షంలో ఇప్పుడు తీసుకుని ఎల్ఆర్ఎస్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక యాప్(App)లో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద మొదటి దశలో వంద ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ఇందులో ఎదురయ్యే మంచి, చెడులను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

గత ప్రభుత్వంలో హయాంలో ఎల్ఆర్ఎస్ కోసం దాదాపు 25 లక్షల దరఖాస్తులు వచ్చాయని, గత నాలుగు సంవత్సరాలుగా అవి ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు.

Related News

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Bathukamma Kunta: బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా.. 25న సీఎం చేతులు మీదుగా ప్రారంభం

Singareni Employees: దసరా కానుకగా సింగరేణి కార్మికులకు భారీ బోనస్‌.. ఒక్కొరికి ఎంతంటే?

Hydra Ranganath: కబ్జాలకు చెక్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై రంగనాథ్ ఏమన్నారంటే..

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Big Stories

×