BigTV English

Ponnam Prabhakar: లాస్య నందిత యాక్సిడెంట్ ఎఫెక్స్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన..

Ponnam Prabhakar: లాస్య నందిత యాక్సిడెంట్ ఎఫెక్స్.. మంత్రి పొన్నం కీలక ప్రకటన..

Ponnam Prabhakar


Ponnam Prabhakar: అతిచిన్న వయస్సులో ఎమ్మెల్యేగా గెలిచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఊహించని రీతిలో కారు ప్రమాదానికి గురై మరణించింది. ఈ ఘటన అందరినీ  దిగ్బాంతి గురి చేసింది. తన తండ్రి సాయన్న మరణించిన సంవత్సరానికి ఆమె కూడా ప్రాణాలు వదలటం మరింత కలిచివేసింది. అయితే ఈ ప్రమాదానికి కారణం. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు నడపటం, అతివేగమేనని పోలీసులు నిర్దారించారు.

కాగా లాస్య నందిత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇది రెండు కారు ప్రమాదం. శుక్రవారం జరిగిన ప్రమాదానికి కారణం డ్రైవర్ ఆకాశే.. అయితే నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ సభ నుంచి వస్తున్నప్పుడు ఆకాష్ కారు నడిపించాడు. అప్పుడూ ఓ వాహనాన్ని తప్పించబోయి.. యాక్సిడెంట్ చేశాడు. అయితే ఈ ప్రమాదానికి ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం . అయితే వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.


లాస్య నందిత మృతిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ క్రమంలోనే వీఐపీల దగ్గర ఉన్న డ్రైవర్లకు ఫిట్ నెస్ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజాప్రతినిధుల రక్షణ ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు.. ప్రజాప్రతినిధుల దగ్గర ప్రస్తుతం ఉన్న డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి ఫిట్ నెట్ పరీక్షలు నిర్వహించినున్నట్లు ఆయన వెల్లడించారు.

Read More: బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్ గూటికి డిప్యూటీ మేయర్ శ్రీలత

ఇదిలా ఉండగా మహాలక్ష్మి పథకం కింద కండక్లర్లు అనవసరంగా టికెట్లు కొడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతంలో రెగ్యులర్ గా 44లక్షల ప్రయాణాలు జరిగితే.. ఇప్పుడు 55లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి రూ. 12వేల హామీ ఇచ్చామని మంత్రి పొన్నం గుర్తు చేశారు. దాన్ని ఖచ్చింగా నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.

మరో వైపు కులగణనపై అధికారులకు శిక్షణ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిహార్ లో 2.5 లక్షల మంది అధికారులను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కరికి 150 ఇండ్లు అప్పజెప్పాలరని పేర్కొన్నారు. ఇక్కడ కూడా ఇళ్లను బట్టి.. అధికారులను నియమిస్తామన్నారు. నోడల్ ఆఫీసర్ గా బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంటు ఉంటుందన్నారు.

 

Tags

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×