E-Paper
Advertisement

Minister Ponnam tribute to Pv Narasimharao: దేశానికి పేరు తెచ్చిన వ్యక్తి పీవీ, ఆయన బాటలో: మంత్రి పొన్నం

Minister Ponnam tribute to Pv Narasimharao: దేశానికి పేరు తెచ్చిన వ్యక్తి పీవీ, ఆయన బాటలో: మంత్రి పొన్నం
Advertisement

Minister Ponnam tribute to Pv Narasimharao: ఆర్థిక భాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి ఎంతో పేరు తెచ్చారన్నారు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల పుణ్యమాని భారత‌దేశం ప్రపంచంలో ఆర్థికశక్తిగా ఎదుగుతుందన్నారు. బహుముఖ ప్రజ్ఞశాలి, అపార మేధావి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 103వ జయంతి నేడు. దేశ ప్రధానిగా ఆయన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు మంత్రి పొన్నం. ఆయనతోపాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

Advertisement

తెలంగాణ ముద్దు బిడ్డయిన పీవీ, వంగరలో జన్మించారు. ఆయన చూపిన మార్గదర్శకంలో తామంతా నడవాలని కోరుకుంటున్నామన్నారు మంత్రి. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చిన వ్యక్తి మన పీవీ అని తెలిపారు. ముఖ్యంగా నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను తీసుకొచ్చిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. పీవీ చూపిన మార్గదర్శకంలో తామంతా నడవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ALSO READ:  మాజీ సీఎం కేసీఆర్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్

Advertisement

విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో దేశం బలమైన ఆర్థికశక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారన్నారు. రాష్ట్రానికే కాకుండా దేశానికీ ఆయన చేసిన సేవలు మరువలేమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

Tags

Related News

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

Big Stories

Advertisement
×