E-Paper
Advertisement

Seethakka: ములుగు అభివృద్ధి బాధ్యత నాది.. గెలిపించే బాధ్యత మీది.. మంత్రి సీతక్క

Seethakka: ములుగు అభివృద్ధి బాధ్యత నాది.. గెలిపించే బాధ్యత మీది.. మంత్రి సీతక్క
Advertisement

Seethakka: ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ములుగు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ వైఖరిని విమర్శిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ములుగుకు చేసిన మేలును ప్రజలకు వివరించారు.

ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి.. జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె ఓటర్లకు పిలుపునిచ్చారు. ములుగు మున్సిపాలిటీగా ఏర్పడటం వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ కృషీ ఉందన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. గత ప్రభుత్వం జిల్లాను మూడు ముక్కలు చేసిందని.. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని విమర్శించారు.

Advertisement

బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మంత్రి కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనను రాజకీయంగా దెబ్బతీయడానికి అప్పటి ప్రభుత్వం ఆగమేఘాల మీద జీవోలు తెచ్చిందని.. కానీ ప్రజలు తన వెంటే ఉన్నారని ఆమె గుర్తు చేశారు. మున్సిపాలిటీ ఏర్పాటు అంశంపై తప్పుడు క్రెడిట్ తీసుకోవాలని చూస్తున్న వారికి చెక్ పెడుతూ.. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రంగా ములుగును అన్ని రంగాల్లో తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని సీతక్క హామీ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధిని కాంక్షించి, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also Read: ప్రియురాలి పెళ్లి పత్రిక చూసి యువ బాడీబిల్డర్ ఆత్మహత్య

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×