E-Paper
Advertisement

Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల బెస్ట్.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల బెస్ట్.. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Medigadda : కాళేశ్వరం కంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఉత్తమమైనది అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లారు. ఈ సందర్భంగా నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు నీరందించేలా డిజైన్ చేశామని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు , పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోెమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

మేడిగడ్డ కుంగినప్పటి నుంచి కేసీఆర్‌ స్పందించలేదని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం బాధాకరమని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ చేపడతామని అసెంబ్లీలో ప్రకటించిన సంగతిని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని 80 వేల కోట్ల నుంచి లక్షా యాభై వేల కోట్లకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందని గుర్తుచేశారు.

ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ ఒకే విధానంతో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో రూ.38 వేల కోట్ల వ్యయంతో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించి 16.40 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించామన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లు వ్యయంతో 18 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వడానికి నిర్ణయించిందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇంజినీర్ల సలహాలు కేసీఆర్‌ తీసుకున్నారా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంజినీర్లుగా సలహాలు ఇవ్వాలి.. వినకపోతే సెలవు పెట్టి పోవాలని స్పష్టం చేశారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ఎప్పుడూ నిండుగా ఉంటుందన్నారు. ఫామ్‌హౌస్‌కు తప్ప ఇతర పొలాలకు నీరు పోదన్నారు.ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీరు వెళ్తోందని కోమటిరెడ్డి నిలదీశారు.

కాళేశ్వరం కోసం ఎంత విద్యుత్‌ వాడారు? అని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగినప్పుడు గత ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేకపోయిందన్నారు. రైతులకు స్పష్టమైన సందేశం పంపాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కాళేశ్వరం ద్వారా ఎన్ని టీఎంసీల నీరు ఎత్తిపోశారు? అని మంత్రి శ్రీధర్‌బాబు నిలదీశారు. తిరిగి గోదావరిలోకి ఎంత నీటిని వదిలారు? అని ప్రశ్నించారు. ఆదాయం ఎక్కువ చూపారు, రూపాయికి 52 పైసలు మాత్రమే ప్రయోజనం కలిగేలా ఉందన్నారు. కాళేశ్వరం కింద ఎకరాకు నీరు ఇచ్చేందుకు అయ్యే ఖర్చు రూ.46 వేలు అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ 90 శాతం ఎత్తిపోతలకే పోతోందన్నారు. మల్లన్న సాగర్ కోసం భూకంప అధ్యయనం చేశారా? అని మంత్రి శ్రీధర్‌బాబు అడిగారు. బాహుబలి పంపుల నాణ్యత, ధరల గురించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు.

నిర్మాణంలో చూపిన అత్యుత్సాహం.. నిర్వహణలో ఎందుకు చూపలేదు? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మహారాష్ట్రకు కూడా లబ్ధి చేకూర్చేలా 148 మీటర్ల ఒప్పందం చేశామన్నారని.. డయా ఫ్రామ్‌ వాల్‌ ఆర్‌సీసీతో కట్టి ఉంటే ప్రమాదం జరిగేదా? అని నిలదీశారు. సీకెండ్‌ ఫైల్‌ ఫెయిల్‌ అయినందుకే రోజు రోజుకు కుంగి పోయిందని వివరించారు. ప్రొటెక్షన్‌ పనులు ఒక్క వరదకే పోతే ఎలాంటి పనులు చేసినట్లు? అని నిలదీశారు. ప్రమాదం ఉందని 2022లోనే ఈఈపై అధికారులు లేఖ రాశారని వెల్లడించారు. నిర్మాణ సంస్థకు రాసిన లేఖలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని గట్టిగా నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుల వివరాలివే..
కాళేశ్వరం అంచనా వ్యయం రూ.1,27,872 కోట్లు కాగా.. కాళేశ్వరం నిర్మాణానికి ఇప్పటి వరకు.. రూ.93,872 కోట్లు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం రూ.71,565 కోట్లు అప్పుగా తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న అప్పులో ఇంకా చెల్లించాల్సిన అసలు రూ.66,868 కోట్లు. డిస్కంలకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు రూ.3,192 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు వాడిన విద్యుత్ 6,918 మిలియన్ యూనిట్లు కాగా ఇప్పటివరకు ప్రాజెక్టు ద్వారా 1,054 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.

Related News

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Big Stories

×