E-Paper
Advertisement

‘డిండి’ పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం!

‘డిండి’ పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం!
Advertisement

Uttam Kumar Reddy: తెలంగాణలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే అత్యంత కీలకమైన డిండి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆయన ఈ ప్రాజెక్టు పురోగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. డిండి ప్రాజెక్టు ఆఫ్ టెక్ పాయింట్ లెవల్ ఫిక్సేషన్‌ను వెంటనే పూర్తి చేసి.. పనుల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఏఎంఆర్‌పీ ఎస్‌ఎల్‌బీసీ (SLBC) ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడంపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న 2400 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 4000 క్యూసెక్కులకు పెంచాలని.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా దీనిని 6000 క్యూసెక్కుల వరకు పెంచేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. ఇందుకోసం లైనింగ్ పనుల కంటే ముందుగా కాలువ విస్తరణకే ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ హై లెవల్ కాలువ లైనింగ్ పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 443 కోట్లు మంజూరు చేసిందని ఆయన గుర్తు చేశారు.

Advertisement

డిండి ఎత్తిపోతల పథకం ద్వారా 228 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 3.61 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 25.31 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నాలుగు ఆన్‌లైన్, ఐదు ఆఫ్‌లైన్ రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. పోతిరెడ్డిపల్లి వద్ద బ్యారేజీ పనులకు సంబంధించి మే 15 నాటికి ఆర్థిక అనుమతులు పొంది.. పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అటవీ భూమి అనుమతులకు సంబంధించి ఉన్న అడ్డంకులు నెల రోజుల్లో తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన పనుల కోసం వెంటనే టెండర్లు పిలవాలని మంత్రి ఆదేశించారు. అలాగే పెండ్లిపాక రిజర్వాయర్ సవరించిన అంచనాలను కేబినెట్ ముందు ఉంచేలా నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇ. శ్రీధర్.. ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Read Also: అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. రెచ్చగొడితే ఊరుకోం, కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×