Big Stories

Uttamkumar counter to KCR : ఎన్నికల తర్వాత దుకాణం క్లోజ్.. కొత్త డ్రామా.. అబద్ధాలు

Uttamkumar counter to KCR :

- Advertisement -

Uttamkumar counter to KCR : పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఎన్నికల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కేసీఆర్ భయాందోళనలో ఉన్నారని, అందుకే పొలం బాట పట్టారని చెప్పుకొచ్చారు. తొలుత జాతీయ పార్టీ అన్నారని, కానీ ఇంత తొందరగా ఏ పార్టీ కుప్పకూలిపోలేదన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులు తప్ప ఆ పార్టీలో ఎవరూ మిగలరన్నారు మంత్రి ఉత్తమ్.

- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇరిగేషన్ సెక్టార్‌పై చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి. అసలు ఇరిగేషన్‌పై మాట్లాడే హక్కు ఆయనకు లేదన్నారు. తన స్వార్థం కోసం ఇరిగేషన్ సెక్టార్‌‌‌ను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. రైతులను కేసీఆర్ ఏనాడూ ఆదుకోలేదని, కాలేశ్వరం పిల్లర్ కుంగిపోవడంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సిగ్గు లేకుండా ఆయన ఎలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కేసీఆర్ మాట్లాడిన ప్రతీ మాట అబద్ధమేనని, ప్రస్తుతం ఆయన డిప్రెషన్‌లో ఉన్నారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. పదేళ్లలో పంట నష్టం జరిగితే..  కేసీఆర్ రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ముఖ్యంగా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని కేసీఆర్ అంగీకరించారని విమర్శించారు. జగన్‌తో కలిసి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణకు ఎక్కువ ద్రోహం జరిగిందన్నారు.

ALSO READ: ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త మలుపు, ఈ వారంలో నేతలకు నోటీసులు!

విద్యుత్ సెక్టార్‌పైనా కేసీఆర్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు మంత్రి ఉత్తమ్. టెక్నికల్ సమస్య వచ్చి కరెంటు పోతే కేసీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారమన్నారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదన్నారు. పోలీసు శాఖను ఎక్కువగా మిస్ యూజ్ చేసింది కూడా కేసీఆరేనని చెప్పుకొచ్చారు. పోలీసులు న్యూట్రల్‌గా ఉండాలని చెప్పి.. ఇప్పుడు ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కరువు వచ్చింది బీఆర్ఎస్ పాలనలోనేనని దాన్ని సమర్థవంతంగా డీల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News