BigTV English

Motorola Edge 50 Pro: మరో రెండు రోజుల్లో మోటరోలా ఎడ్జ్50 ప్రో లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే!

Motorola Edge 50 Pro: మరో రెండు రోజుల్లో మోటరోలా ఎడ్జ్50 ప్రో లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే!
Motorola Edge 50 Pro
Motorola Edge 50 Pro Price and Specifications

Motorola Edge 50 Pro Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఇప్పటికే ఎన్నో మోడళ్లను రిలీజ్ చేసి ఫోన్ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ కంపెనీ మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. మోటరోలా తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో’ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.


ఈ ఫోన్‌ను ఈ నెల అంటే ఏప్రిల్ 3వ తేదీన లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ త్వరలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ ఫోన్ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఈ ఫోన్ IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 125W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతునిస్తుంది. అంతేకాకుండా ఇది AI- పవర్డ్ కెమెరా సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. అలాగే స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoCలో రన్ అవుతుంది.

అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే దీని ధరను కంపెనీ వెల్లడించలేదు. అయితే తాజా అంచనా ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్‌ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ.44,999 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాల విషయానికొస్తే..


Also Read: ఈ రోజే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలు ఇవే..!

ఈ ఫోన్ ముఖ్యంగా మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది. అందులో బ్లాక్, పర్పుల్, వైట్‌. ఇది 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 2000 పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 6.7 అంగుళాల పోఎల్‌ఈడీ డిస్‌‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా SGS ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ సౌకర్యవంతమైన వీక్షణ కోసం బ్లూ లైట్ ఉద్గారాలను తగ్గిస్తుంది.

ఇక ఫోన్ భద్రతకు ప్రాధాన్యతను ఇస్తూ కంపెనీ ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను అందించింది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌తో రానుంది. ఇక దీని కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్.. ఏఐ ఫీచర్లతో కూడిన వర్సటైల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రావైడ్ సెన్సార్‌తో కూడిన 13 మెగాపిక్సెల్ , ఐఓఎస్‌ 30ఎక్స్ హైబ్రీడ్ జూమ్‌తో కూడిన టెలీఫొటో లెన్స్‌లు ఉన్నాయి. ఫోన్ ముందుభాగంలో 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

అంతేకాకుండా 125W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, అలాగే 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W వైర్‌లెస్ పవర్-షేరింగ్ మద్దతుతో ఛార్జింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది మోటోరోలా Hello UIతో ప్రారంభించబడింది. దీంతోపాటు మరెన్నో అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Tags

Related News

Instagram Friend Map: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ప్రమాదకరమని హెచ్చరిస్తున్న నిపుణులు

Oppo K13 Turbo vs Redmi Note 13 Pro+ 5G: మిడ్ రేంజ్‌లో టఫ్ ఫైట్.. రెండు ఫోన్లలో ఏది బెస్ట్?

Control Z iphone Sale: రూ.9999 కే ఐఫోన్.. త్వరపడండి లిమిటెడ్ ఆఫర్

Keyboard Mouse AI: కీ బోర్డ్, మౌస్ లేకుండానే కంప్యూటర్లు.. అంతా ఏఐ మహిమ!

Flipkart Oppo: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. ఒప్పో స్మార్ట్‌ఫోన్‌లపై సూపర్ డీల్స్

Vivo V60 vs Oppo Reno 14: ₹40,000 బడ్జెట్ లో ఏది బెటర్?

Big Stories

×