Big Stories

Phone tapping case: ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త మలుపు, ఈ వారంలో నేతలకు నోటీసులు!

TS Phone tapping case Update

- Advertisement -

TS Phone tapping case Update(Breaking news in telangana): తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం అనేక మలుపులు తిరుగుతోంది. పలువుర్ని అదుపులోకి తీసుకుని విచారించిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులతోపాటు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉంచ వచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రణీత్‌రావు.. అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు అధికారులు గుర్తించారు. దీనికితోడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి బంధువుల ఫోన్లపై నిఘా పెట్టారు. వారి తరలిస్తున్న నగదు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన సమాచారం అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొద్దిరోజుల కిందట అరెస్టయిన అధికారులు అంగీకరించారు కూడా.

నిందితుడు ప్రణీత్‌రావు పలువురి ఫోన్లపై నిఘా ఉంచారని, వారిచ్చిన సమాచారం ఆధారంగా టాస్క్‌ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్‌రావు క్షేత్రస్థాయిలో నగదు పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించినట్టు గుర్తించారు. ఇంకో విషయం ఏంటంటే.. ఎవరెవరికి డబ్బు అందజేశామనే సమాచారం కూడా అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విషయాలను నిర్ధారించుకోవడానికి డబ్బు అందుకున్న వారిందరికీ నోటీసులు ఇచ్చి విచారించాలని ఆలోచన చేస్తున్నారు అధికారులు.

ALSO READ : మధ్యంతర బెయిల్ కోసం.. కోర్టులో విచారణ, ఈసారి?

ఇందులో మాజీమంత్రులకు ఉన్నట్లు వార్తలు జోరందుకున్నాయి. న్యాయపరమైన అంశాలపై చర్చలు జరుపుతున్నారని, దీనిపై ఓ క్లారిటీ వచ్చిన తర్వాత ఈ వారంలో నేతలకు నోటీసులు ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఇదిలావుండగా ఫోన్ ట్యాప్ చేసి తనను బెదిరించారని ఓ వ్యాపారి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారట.

ఈ కేసులో మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబీలో చాలాకాలం పని చేసిన దయానందరెడ్డి.. ప్రభాకర్‌రావుకి అత్యంత నమ్మకస్తుడిగా పేరు సంపాదించారు. ఎస్ఐబీ‌లో ఓఎస్డీ‌గా పని చేశారు దయానందరెడ్డి. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనకు పిలుపు రావచ్చనంటూ వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News