Miss World Contestant: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలు అద్భుతంగా జరుగుతున్నాయి. పోటీల్లో పాల్గొన్న ముద్దుగుమ్మలు తెలంగాణ పట్ల తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. హైదరాబాద్‌కి రావడం చాలా సంతోషంగా ఉందని చెప్తోంది మెక్సికో కంటెస్టెంట్ మారియెల్లి లియోల్. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని చెప్పున్న అందాల భామ మారియెల్లి లియోల్. తెలంగాణ మాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందని, తెలంగాణ గురించి చాలా గోప్పగా.. చాలా సంతోషంగా లియోల్ మీడియా సమావేశంలో తెలిపారు.
మిస్ వరల్డ్ 2025, 72 ఎడిసన్‌కి సంబంధించి ఎంతో మంది కంటెస్టెంట్‌లు హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్‌లో అన్ని ప్రదేశాలు తిరిగేస్తున్నారు. ఇక్కడ మన కల్చర్ వాళ్లకు బాగా నచ్చింది. హైదరాబాద్‌కు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అని మిస్ వరల్డ లియోల్ తెలిపారు. ఇక్కడకి వచ్చిన మమ్మల్ని చాలా ప్రేమతో స్వాగతించారు.. అంతేకాకుండా ఇక్కడి చుట్టు పక్కల ప్రదేశాలన్నీ మాకు బాగా నచ్చాయి చెప్పారు. మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమొహల్లా ప్యాలెస్, హైదరాబాద్‌లోని చారిత్రక నిర్మాణాలు, కట్టడాల విశిష్టతపై అధికారులు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్యాలస్‌లో ఏర్పాటే చేసిన ఫోటో ఎగ్జిబిషన్ అందాలభామలు తిలకించారు. మిస్ వరల్డ్ ఈవెంట్‌తో హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో నిలిచిపోతుందని చాలా మంది సభ్యులు తెలిపారు.
మిస్ వరల్డ్ లియోల్ మీడియాతో మిమ్మల్ని ఎంతో ప్రేమతో స్వాగతించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియ జేశారు. అలాగే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు మమ్మల్ని బాగా ఆకట్టుకున్నాయని తెలిపారు. తెలంగాణలో పర్యాటక ప్రదేశాలు చాలా బాగా ఆకట్టుకునేలా ఉన్నాయని లియోలి చెప్పారు. అయితే చార్మినార్ దగ్గర జరిగిన హెరిటేజ్ వాక్ వారికి చాలా సంతృప్తిపరిచిందని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఇక్కడి మర్యాదలు మాకు చాలా బాగా నచ్చాయని, అలాగే ఇక్కడి ప్రజల ప్రేమ వారిని బాగా ఆకట్టుకుందని తెలిపారు. ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలోని ప్రదేశాలు చాలా బాగున్నాయని లియోల్ వ్యక్తం చేశారు.
Also Read: బట్ట కాల్చి మీదేస్తున్నది ఎవరు? కమిషన్లు తీసుకుందెవరు?
అయితే ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలు కొన్ని ఆందోళకరమైన పరిస్థితులను దారి తీస్తుంది. ప్రస్తుతం జరిగిన ఆపరేషన్ సిందూర్ యుద్ధం వల్ల ఐపిఎల్ మ్యాచ్‌ని నిలిపివేసారు. అలాగే హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఇండియా, పాకిస్థాన్ వార్‌లో కూడా ఈ అందాల ముద్దుగుమ్మల పోటీలు కొనసాగాయాయి. అయితే కొందరు వ్యక్తులు అందాల పోటీలకు లేని ముప్పు ఐపీఎల్‌కు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ ఎందుకు ఆపేసారు అనే చర్చ కొనసాగుతుంది.