Pawan Kalyan: కశ్మీర్ లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని కదిలించిన విషయం తెలిసిందే. దాడి ఘటన తర్వాత ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోయాడు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పీవోకేలో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి టెర్రరిస్టులను హతం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ వందల డ్రోన్ లతో అటాక్ చేయగా.. భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో.. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు భారత్, పాక్ దేశాలు అంగీకరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్ పై సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు.
జమ్ము కశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారతదేశానికి.. మనదేశ త్రివిధ దళాల రక్షణ కోసం పూజలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ‘ఇలాంటి సమయంలో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్, పీవోకేలోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి త్రివిధ దళాలు తిరుగులేని ధైర్య సాహసాలను ప్రదర్శించాయి. భారత్ కు రక్షణ కవచంలా నిలచిన భద్రతా దళాలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత దేశానికి, రక్షణ బలగాల రక్షణ కోసం తమిళనాడులోని దేవ సేనాని శ్రీ సుబ్రమణ్య స్వామి వారి 6 షష్ట షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్య నారాయణ ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేసిన జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని చెప్పారు.
జాతీయ భద్రత కోసం జనసేన సర్వమత ప్రార్థనలు, సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం
జమ్మూ & కాశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించింది. ఇలాంటి సమయంలో "ఆపరేషన్ సిందూర్" ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్… pic.twitter.com/Cr5H0bcMuD
— Pawan Kalyan (@PawanKalyan) May 16, 2025
Also Read: New Covid-19 Symptoms: దడ పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. లక్షణాలు ఇవే !
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ PAC చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్, MLC పిడుగు హరిప్రసాద్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పత్సమట్ల ధర్మరాజు, పంతం నానాజీ, సుందరపు విజయ్ కుమార్, బోలిశెట్టి శ్రీనివాస్, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ, AHUDA చైర్మన్ T.C వరుణ్, KUDA చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, అలాగే మతాలకు అతీతంగా ఈ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్క నాయకులకు పవన్ కల్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా, బలంగా నిలబడాలని.., భారత దేశపు ఐక్యతను చాటి చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
Also Read: Pakistan: పాక్ ప్రధాని సంచలన ప్రకటన.. భారత్‌తో చర్చలకు మేం రెడీ, కాకపోతే..