E-Paper
Advertisement

ప్రజలే మీ బట్టలు విప్పేశారు.. ఇంకా ఎందుకు ఈ డ్రామా?

ప్రజలే మీ బట్టలు విప్పేశారు.. ఇంకా ఎందుకు ఈ డ్రామా?
Advertisement

MLA Anirudh on BRS:తెలంగాణా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై తాతా మధు చేసిన కామెంట్స్ విషయంలో తెలంగాణ అసెంబ్లీలో మరోసారి మంటలు పుట్టించింది. రామాయణంలో వాలికి ఎలాగైతే ఎదురుగా వెళ్తే సగం శక్తులు అతడికి వెళ్ళిపోతాయో అలాగే ఎంత కోపం, బాధ ఉన్నా స్పీకర్ ప్రసాద్ గారిని చూడగానే అన్ని మాయం అయిపోతాయని తన అభిప్రాయాన్ని తెలిపారు. అంత మంచి మనిషిని పట్టుకుని అలా బూతులతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.

ఎల్లమ్మ వారినే అవమానించినట్టు

Advertisement

స్పీకర్ గారి అమ్మ పేరు ఎల్లమ్మ అని, బి ఆర్ యస్ వారు ఎల్లమ్మ వారినే అవమానించినట్టు భావిస్తామని చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరినైనా విమర్శించొచ్చని, కానీ వ్యక్తిగతంగా మాట్లాడటం మాత్రం మంచిది కాదన్నారు. ముఖ్యంగా స్పీకర్ గురించి, ఆయన కుటుంబం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.స్పీకర్ కుర్చీకి గౌరవం ఇవ్వాలని అనిరుధ్ అన్నారు. స్పీకర్ కూడా మనలాంటి వ్యక్తేనని, ఆయనకు కూడా కుటుంబం ఉందని గుర్తు చేశారు. రాజకీయ గొడవలు ఏమైనా ఉంటే రాజకీయాల వరకే ఉంచుకోవాలని సూచించారు.

అసెంబ్లీలో సభ్యులకు మాట్లాడేందుకు సమయం ఇస్తారని అనిరుధ్ చెప్పారు. ఏ అంశంపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారో.. అదే అంశంపై మాట్లాడాలని అన్నారు. మధ్యలో వేరే విషయాలు తీసుకురావడం వల్ల సభా సమయం వృథా అవుతుందని చెప్పారు. ప్రజల సమస్యలపై మాట్లాడేందుకు ఎమ్మెల్యేలు సభకు వస్తారని.. అలాంటి సమయంలో వ్యక్తిగత గొడవలతో సమయాన్ని  చేయకూడదన్నారు.

Advertisement

స్పీకర్‌పై అలా మాట్లాడటం బాధేసింది

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కొందరు చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని అనిరుధ్ చెప్పారు. స్పీకర్ పదవికి అందరూ గౌరవం ఇవ్వాలని అన్నారు.ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించొచ్చు.. విమర్శించొచ్చు.. కానీ వ్యక్తిగతంగా దూషించడం మాత్రం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.

‘ప్రజలే మీ బట్టలు విప్పేశారు’

ఇక బీఆర్ఎస్ నేతలపై అనిరుధ్ కౌంటర్ వేస్తూ మీరు బట్టలు విప్పడం ఏంటని, ప్రజలే 2023లో తమ ఓటుతో మీ బట్టలు ఎప్పుడో విప్పేశారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఏం అనుకున్నారో ఫలితాలు చెప్పాయని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజల తీర్పు మారదని ,ఆ మాత్రం దానికి ఇంకా ఈ డ్రామాలు ఎందుకని ఫైర్ అయ్యారు.బీఆర్ఎస్ నేతలు సభలో గట్టిగా మాట్లాడటం కంటే.. ప్రజల సమస్యలపై మాట్లాడితే మంచిదని సూచించారు.

ALSO READ:బూతులు, బట్టలు విప్పడాలు.. ఇదేం దారుణం..కూనంనేని ఫైర్

మొత్తంగా స్పీకర్‌పై జరిగిన వ్యాఖ్యల విషయంలో ఎమ్మెల్యే అనిరుధ్ బీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ‘ఓట్లతో ప్రజలే మీ బట్టలు ఎప్పుడో విప్పేశారు’ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Tags

Related News

మీ అయ్య జాగీరా.. మా MLCలను సస్పెండ్ చేస్తావా? కేటీఆర్ ఫైర్

కోర్టు ఉత్తర్వులంటే అలుసా? ఐఏఎస్‌ల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!

తెలంగాణ శాసన మండలిలో షాకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ తాతా మధు, నవీన్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు!

బూతులు, బట్టలు విప్పడాలు.. ఇదేం దారుణం..కూనంనేని ఫైర్

“చిల్లర నా కొ..” అంటూ రెచ్చిపోయిన KTR.. పోలీసులతో రచ్చ!

అదో దెబ్బ, దానికో పరామర్శ.. టీవీలు చూస్తూ నవ్వుకుంటున్నారు.. బండి సెటైర్లు!

తెలంగాణ అసెంబ్లీ ఆవరణంలో విషాదం.. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ పీఏ రాజు మృతి!

Big Stories

Advertisement
×