Bandi Sanjay: స్పీకర్‌ను బీఆర్ఎస్ నేతలు అసభ్య పదజాలంతో దూషించడాన్ని ప్రజాస్వామ్యవాదులెవరూ జీర్ణించుకోలేరని కేంద్ర సహయక మంత్రి బండి సంజలయ్ అన్నారు. తాతా మధుతోపాటు పోలీసులపై చేయి చేసుకున్న బీఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందేనని అన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని, ప్రజా సమస్యలపై ఇకనైనా డైవర్షన్ డ్రామాలాపండని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల బజారు భాషను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. 22ఏతో జనం అల్లాడుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ నేతల రూ.వేల కోట్ల భూ దందా చేస్తున్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రాక, సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్ధులు అరిగోస పడుతున్నరని తెలిపారు.
సాగు నీరందక దక్షిణ తెలంగాణ రైతాంగం ఆందోళనతో ఉందని, ఉద్యోగాలు లేక, ఐటీ సంస్థలు, పరిశ్రమలు మూతపడి నిరుద్యోగులు అల్లాడుతున్నరన్నారు. బీఆర్ఎస్ నేతలకు దెబ్బలు తగలక పోయినా ఏదో జరిగినట్లు షో చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అసెంబ్లీకే రాని కేసీఆర్ కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఎందుకు? ఎర్రవల్లి ఫాంహౌజ్ పై దాడి, కేసీఆర్ పై హత్యాయత్నం పెద్ద జోక్ అని సెటేర్లు వేసారు. కేసీఆర్ కలుగులో దాక్కున్నాడు. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసే సంస్కృతిని నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. ఎర్రవల్లిలోనైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేసీఆర్ హాజరయ్యేలా చర్యలు తీసుకోండని అన్నారు.
రెండు పార్టీలు కలిసి ప్రజలను దోచుకుతింటున్నాయి. ప్రజా సమస్యలు కనీసం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు, దోపిడీ, అవినీతిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇకనైనా డ్రామాలు కట్టి పెట్టండి. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కార మార్గాలు చూపండని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీ మాత్రమేనని డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం అని అన్నారు. అసెంబ్లీలో బీజేపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు.
Also read: ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. వాళ్ల ఉద్యోగాలు ఔట్!