త్వరలోనే జన్మాష్టమి రాబోతోంది. శ్రీకృష్ణుని ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేసేందుకు సిద్ధమైపోతారు. అయితే శ్రీకృష్ణుడికి రాశి చక్రాలలో ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. ప్రతి రాశి వారిపైన శ్రీకృష్ణుడి ఆశీస్సులు ఉంటాయి. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ప్రత్యేకించి ఆశీస్సులు లభిస్తాయి. కృష్ణుడికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకోండి.
వృషభ రాశి
జ్యోతిష్శాస్త్రం ప్రకారం వృషభ రాశి శ్రీకృష్ణుడికి ఇష్టమైన రాశులలో ఒకటి. ఈ రాశిలో పుట్టిన వారిపై శ్రీకృష్ణుడి ప్రత్యేకమైన ఆశీస్సులు ఉంటాయి. వారు ఎల్లప్పుడూ పురోగతి మార్గంలోనే నడుస్తారు. వారికి అన్ని వైపుల నుండి విజయాలు దక్కుతాయి. ఈ రాశి వారికి కష్ట సమయాల్లో కూడా తమను తాము రక్షించుకునే శక్తి ఉంటుంది. శ్రీకృష్ణుడే వారికి ఆసక్తిని అందిస్తాడు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శ్రీకృష్ణుడు దీవెనలు నిత్యం ఉంటాయి. ఈ రాశి వారు శ్రీకృష్ణుడిని ప్రతిరోజు పూజిస్తే వారి కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలోని అన్ని కష్టాలను సులువుగా అనుగమించవచ్.చు అలాగే వీరికి శ్రీకృష్ణుడి దయ వల్ల జీవితంలో దేనికి కొరత రాకుండా ఉంటుంది.
సింహ రాశి
సింహ రాశి వారిపై శ్రీకృష్ణుడికి ఎంతో ప్రేమ శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన రాశి కూడా సింహరాశి. సింహరాశిలో పుట్టిన వాళ్ళు… పుట్టుకతోనే ధైర్యవంతులుగా పరాక్రమవంతులుగా ఉంటారు. అలాగే కృష్ణుడిని వీరు క్రమం తప్పకుండా పూజిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఆయన ప్రత్యేక ఆశీర్వాదాలు సింహ రాశి వారు అందుకుంటారు. సింహరాశిలో పుట్టిన వారికి ప్రతి పనిలో విజయం దక్కుతూనే ఉంటుంది. చెడిపోయిన పని కూడా సులభంగా పూర్తవుతుంది.
తులారాశి
తులారాశి వారిపై శ్రీకృష్ణుని ఆశీస్సులు ఎక్కువ. తల్లి ఒక బిడ్డను ఎంతగా ప్రేమిస్తుందో శ్రీకృష్ణుడు కూడా తులా రాశి వారిని అంత ఇష్టపడతాడు. తులారాశి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చూస్తాడు. వారు పూజ చేస్తే ఎంతో ఆనందపడతాడు. కాబట్టి తులా రాశి వారు నిత్యం శ్రీకృష్ణుని పూజిస్తే మంచిది. ఈ వ్యక్తులు తాము చేసే ప్రతి పని నుండి శుభ ఫలితాలను పొందుతారు.