E-Paper
Advertisement

KTR: లిక్కర్ కేసులో కవితకు ఊరట.. కోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే!

KTR: లిక్కర్ కేసులో కవితకు ఊరట.. కోర్టు తీర్పుపై కేటీఆర్ రియాక్షన్ ఇదే!
Advertisement

KTR: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్.. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్న వీరితో పాటు మొత్తం 23 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ క్లీన్‌ చీట్‌ ఇచ్చింది.

ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి.. తెలంగాణ అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ‘లిక్కర్ స్కామ్’ అనే కల్పిత గాథను తెరపైకి తెచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కావాలనే తప్పుడు కథనాలను ప్రచారం చేయడం వల్ల గత ఎన్నికల్లో తమ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రతీకారంతోనే తమ నాయకులపై ఇన్ని రోజులు తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు.

Advertisement

కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగిందని.. అదే విధంగా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన ప్రతి కేసు తప్పుడుదని.. రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే రుజువవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్ధారించే వరకు కాంగ్రెస్.. బీజేపీలు చేసే బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను ప్రజలు భరించాల్సి వస్తోందని విమర్శించారు. మీడియా ట్రయల్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించి తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే వీరి లక్ష్యమని దుయ్యబట్టారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కేందుకు ప్రభుత్వ సంస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు.

“న్యూ ఇండియా”లో ఆధారాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యత పెరిగిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే తీర్పులుగా మారుతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా న్యాయమే గెలుస్తుందని.. తమపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కాలమే నిరూపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కవిత నిర్దోషిగా బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ తీర్పు రాజకీయంగా తమకు పెద్ద నైతిక విజయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Read Also: Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసు.. న్యాయస్థానం క్లీన్ చిట్, కవిత ఫస్ట్ రియాక్షన్

Advertisement

 

Related News

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అవన్నీ ఆన్‌లైన్ లోనే..?

ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మనవే.. కార్యకర్తలకు రాంచందర్ రావు దిశానిర్దేశం!

ఇదేనా ప్రజాపాలన.. బతుకమ్మ పండగల వేళ ఆర్టీసీ ఛార్జీలు పెంపు, హరీశ్‌రావు ఆగ్రహం

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

Big Stories

Advertisement
×