BigTV English

CM Revanth Reddy : కూల్చేస్తారా? రేవంత్‌ను టచ్ చేసి చూడు..

CM Revanth Reddy : కూల్చేస్తారా? రేవంత్‌ను టచ్ చేసి చూడు..

CM Revanth Reddy : ఎవర్రా మీరంతా? రేవంత్ అంటే ఫ్లవర్ అనుకుంటిరా? కాదు, ఫైర్.. వైల్డ్ ఫైర్. దమ్ముంటే టచ్ చేసి చూడు.. అంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ శ్రేణులు రగిలిపోతున్నారు. బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్‌ పాలనతో బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు విసిగిపోయారని, వాళ్లు ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారంటూ కలకలం రేపారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. తామే ఆ ఖర్చును భరిస్తామని వారంతా అంటున్నారంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.


కొత్త.. మాట మార్చారెందుకు?

ఇదేమన్నా చిన్నమాటా? రెండు వారాల క్రితం ఇదే ప్రభాకర్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. ఇప్పుడేమో ఇలా పడగొడతారంటూ బాంబు పేల్చడం వెనుక పెద్ద కుట్రే ఉందని అనుమానిస్తున్నారు.


ఎర్రబెల్లి, జగదీష్‌రెడ్డి కూడా…

కొత్త ప్రభాకర్‌రెడ్డినే కాదు. అటు మాజీ మంత్రి ఎర్రబెల్లి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. మంత్రివర్గ విస్తరణ జరిగిన వెంటనే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. మంత్రి పదవి రాని అసంతృప్తులంతా కాంగ్రెస్‌ను వీడిపోతారని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడే ఉంటుందని.. బీఆర్ఎస్ సత్తా చూపిస్తుందని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ లోనే అంతర్గతంగా ప్రభుత్వాని కూల్చే కుట్ర జరుగుతోందని అన్నారు.

ఏదో కుట్ర జరుగుతోందా?

ఏదో జరుగుతోంది. ఒకరి తర్వాత ఒకరు. రేవంత్ సర్కారు కూలుతుందంటూ పక్కాగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సాఫ్ట్ లీడర్‌గా పేరున్న కొత్త ప్రభాకర్‌రెడ్డితో అలాంటి కామెంట్స్ గులాబీ పెద్దలే చేయించారని అంటున్నారు. ఇక కేసీఆర్ అంతరంగికుడిగా పేరున్న ఎర్రబెల్లితో ఎవరు మాట్లాడించారో వేరే చెప్పాల్సిన పని లేదు. ముందుముందు ఇలాంటి దుష్ప్రచారం మరింత సాగుతుందని కాంగ్రెస్ శ్రేణులు అనుమానిస్తున్నారు. ప్రజా పాలనను చూసి ఓర్వలేకే.. ప్రభుత్వం పడిపోతుందంటూ నెగటివ్ ప్రచారం చేస్తూ.. రేవంత్ సర్కారుపై మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే గులాబీ రెక్కలు రాలిపోయాయి. మిగిలిన వారిని కాపాడుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. మళ్లీ అనవసరంగా రేవంత్‌ను రెచ్చగొడితే నష్టం ఎవరికి? డెంటింగ్ పడిన కారు.. ఇక షెడ్డుకే.. అని వార్నింగ్ ఇస్తున్నారు హస్తం నేతలు. ఆ సెగ అప్పుడే స్టార్ట్ అయిపోయింది.

కొత్తకు నిరసన సెగ

దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని.. సిద్దిపేట, దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకుని.. దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు.

మంత్రుల ఎదురుదాడి..

ప్రజల మద్దతున్న ప్రభుత్వాన్ని కూలదోస్తామనడం కొత్త ప్రభాకర్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పదేళ్ల అక్రమ సంపాదనతో ఏదైనా చేయొచ్చని అనుకుంటే భ్రమేనని.. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రభుత్వానికి వచ్చిన లోటేమీ లేదని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వాన్ని కూలిస్తే చేతులు కట్టుకొని కూర్చోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్ పోర్టు వ్యాపారంతో పాటు జ్యోతిష్యం కూడా చెబుతున్నారని సెటైర్లు వేశారు.

Also Read : ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. ఎందుకంటే…

టచ్ చేసి చూడు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉంటుందని.. మరోసారి కూడా అధికారంలోకి వస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గత పదేళ్ల అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొనాలని చూసినా.. ప్రజా ప్రభుత్వం కూలిపోదని అన్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో తామూ చూస్తామని.. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారాయన.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×