Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో.. రానున్న మూడునాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఏపీలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు.. ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్య కారులు సోమవారం వరకు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారుతూనే ఉన్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండ, ఉక్కపోత వాతావరణం చూస్తున్నాము. ఇక సాయంత్రం సమయంలో చిన్న చిన్న చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ రోజు నుంచి రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు.
ఈ రోజూ నుంచి మూడు రోజుల వరకు తేలికపాటి వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజూ ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ వంటి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో తేలికపాటి వర్షాలు తెలంగాణ రాష్ట్రం అంతట విస్తరించి జూలై 9 వరకు ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ముందస్తు రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడం వల్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల వర్షాలు బాగా కురిశాయి. కానీ ఇన్ని రోజులు వర్షాలు కావల్సిన సమయంలో గాలిలో సరిపడినంత తేమ లేకపోవడం వల్ల కురవాల్సిన వర్షం కురవడం లేదు. అయితే ఇప్పుడు మాత్రం భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వర్షాల రాక కోసం రైతులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read: అంబటికి కొత్త పదవి
ఇక హైదరాబాద్‌లో నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ఇంకా హైదరాబాద్‌లో వర్షాలు పడితే ప్రజలు అల్లకల్లోలం అవుతారు. ట్రాఫిక్ జామ్‌లు, ఇళ్లలోకి నీరు రావడం, రోడ్లు చెరువులుగా మారడం వంటి ఇబ్బందులు ఉంటాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షంలో బయటకు రాకూడదని, అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖవారు చెబుతున్నారు.