BigTV English

Chamala: పదేళ్లు మంత్రిగా పనిచేసిన మీకు ‘ఇది కూడా తెల్వదా కేటీఆర్’..? : చామల

Chamala: పదేళ్లు మంత్రిగా పనిచేసిన మీకు ‘ఇది కూడా తెల్వదా కేటీఆర్’..? : చామల

MP Chamala Kiran Kumar Reddy Comments: సోషల్ మీడియాలో మాజీ మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాజాగా మరో పోస్ట్ పెట్టారు. కేటీఆర్ ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కేటీఆర్ పై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే.. ‘కేటీఆర్ గారు ఎక్స్ వేదికగా మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి తప్పుడు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను నేను ఖండిస్తున్నాను. ఇందుకు సంబంధించి నేనొక వీడియో సందేశాన్ని విడుదల చేస్తున్నాను. కేటీఆర్ గారు మళ్లీ ఒకసారి మీరు ఎక్స్ వేదిక గా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. ట్వీట్ చేసే ముందు నిజాలు ఏమిటో తెలుసుకుని చేయాలి. గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ ఓర్వలేకపోతున్నారు. ఎక్స్ లో ఏదో ఒక ట్వీట్ రెగ్యులర్ గా పోస్ట్ చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు కేటీఆర్. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లోతెలంగాణ టాప్ టెన్ లో లేకుండా పోవడానికి కాంగ్రెస్ పార్టీ అని ఏదో ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసి, ఏ ప్రాతినిథ్యంతో ఈ ర్యాంక్ లిస్టు తీసుకున్నారనే ఆలోచన లేకుండా సోషల్ మీడియాలో ఆ ట్వీట్ చేయడం అనేది కేటీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నాను. బిజినెస్ రీఫామ్స్ యాక్షన్ ప్లాన్ 2022లో ఉన్నటువంటి గ్రాఫ్, విధివిధానాలను తీసుకొని ఇప్పుడు డిక్లేర్ చేయడం జరిగింది.


Also Read: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి విధివిధానాలను, కార్యాచరణను తీసుకుని ఈ ఆర్టికల్ ప్రచురించిన సంగతి తెలుసుకోకుండా.. కేటీఆర్ దాని గురించి కనీసం ఆలోచన చేయకుండా, పట్టించుకోకుండా ట్వీట్ చేశారు. కేటీఆర్ మీరు ఏదైనా ట్వీట్ చేసేటప్పుడైయినా, మాట్లాడేటప్పుడైయినా, సరియైన నివేదికలు, గ్రౌండ్ వర్క్ చేసుకుని మాట్లాడాలని సూచిస్తున్నాను. వాస్తవాలు ఏంటో తెలుసుకుని మాట్లాడాలని, ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు కేటీఆర్. పదేళ్లు పరిపాలించిన మీకు ఒక బాధ్యత ఉంది. వాస్తవం ఏమిటి, అవాస్తవాలు ఏమిటి? అనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందనేది మర్చిపోవద్దని కేటీఆర్ కు సూచిస్తున్నాను’ అంటూ ఎంపీ చామల ఆగ్రహం వ్యక్తం చేశారు.


Related News

Raksha Bandhan tragedy: చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

Necklace Road Flyover: 8 నిమిషాల్లో బేగంపేట?.. నక్లెస్ రోడ్ పై కొత్త ఫ్లైఓవర్ స్కెచ్ ఇదే!

CM Revanth Reddy: ముందు చట్టం తెలుసుకో.. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ కౌంటర్

Telangana Rains: మరో 2 గంటల్లో భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో తస్మాత్ జాగ్రత్త!

Kova Lakshmi: కాంగ్రెస్ నేతను వాటర్ బాటిల్ తో కొట్టిన BRS ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?

CM Revanth Reddy: మా కమిట్మెంట్ నిరూపించుకున్నాం.. పది రోజులు చాలన్న సీఎం రేవంత్

Big Stories

×