E-Paper
Advertisement

కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Advertisement

MP Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అబద్దాల రావు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, కేటీఆర్ తనలో నిలువెత్తు విషం నింపుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ వరుస ఎన్నికల్లో ఓడిపోవడంతో కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయారని, అధికారం పోయిందన్న బాధతో ఆయనకు నిద్ర పట్టడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ తాము ఎప్పటికీ అధికారంలోనే ఉంటామని భ్రమపడ్డారని, కానీ ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రం 16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడితే, బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని చామల ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ పార్టీ ఘనతేనని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మెట్రో రైలు వంటివన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ వంటి ప్రాజెక్టులు దశాబ్దాలైనా చెక్కు చెదరకుండా ఉన్నాయని, కానీ కేసీఆర్ తనను తాను విశ్వేశ్వరయ్యగా భావించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే కూలిపోయిందని ఎద్దేవా చేశారు.

Advertisement

గడిచిన పదేళ్లలో కేసీఆర్ కుటుంబం ఫామ్‌హౌస్ పరిపాలన సాగించిందని, నిజాం నవాబుల్లా ప్రజలను వేధించారని చామల విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికి ఎర్రవెల్లి, జనవాడ, మొయినాబాద్, శంకర్ పల్లిలో వేల కోట్ల విలువైన ఫామ్‌హౌస్‌లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడం, దాచుకోవడం, ఓట్లు కొనుక్కోవడమే వారి లక్ష్యమని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిస్తే, దానిని తప్పుబట్టడం కేటీఆర్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ప్రజల కోసమే సీఎం ‘ఫ్యూచర్ సిటీ’ని ప్రతిపాదించారని, హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు.

ఇబ్రహీంపట్నంలో ఒక మున్సిపాలిటీ గెలవగానే కేటీఆర్ తొడలు కొట్టడం హాస్యాస్పదమని చామల అన్నారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్ని ఎకరాల భూములు కబ్జా చేశారో ప్రజలకు తెలుసని, ఆయన ‘మందిని ముంచే కిషన్ రెడ్డి’ అని విమర్శించారు. కేటీఆర్ తన ప్రెస్ మీట్లలో అబద్దాలు చెబుతున్నారని, వాటిని ఎవరూ పట్టించుకోరని కొట్టిపారేశారు. రాష్ట్రంలో రాబోయే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రజల నాడి కాంగ్రెస్ పార్టీకి తెలుసని, బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమని చామల కిరణ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.

Advertisement

Read also: గుజ‌రాత్ రాజకీయాల్లో విచిత్రం.. మూడు పార్టీల తరపున ఒకే అభ్యర్థి నామినేషన్!

Related News

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×