E-Paper
Advertisement

నిన్నటి దాకా పిట్టల దొరని చూశారు.. ఇకపై పిట్టల దొరసానిని చూస్తారు, కవితపై ఎంపీ అర్వింద్ సెటైర్లు

నిన్నటి దాకా పిట్టల దొరని చూశారు.. ఇకపై పిట్టల దొరసానిని చూస్తారు, కవితపై ఎంపీ అర్వింద్ సెటైర్లు
Advertisement

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్సీ కవితపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె ఇంకా టీఆర్ఎస్ హ్యాంగోవర్ నుంచి బయటపడలేదని విమర్శించారు. అందుకే తన కొత్త పార్టీకి మళ్లీ టీఆర్ఎస్ అనే పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత రాజకీయ భవిష్యత్తును బీజేపీ ఎప్పుడో ముగించేసిందని.. ఆమెను ప్రజలు కూడా మర్చిపోయారని పేర్కొన్నారు. నిన్నటి వరకు రాజకీయాల్లో ‘పిట్టల దొర’ క్యారెక్టర్ చూశామని.. ఇకపై ‘పిట్టల దొరసాని’ వేషధారణను చూస్తారంటూ సెటైర్లు వేశారు.

తెలంగాణ సమాజం కవిత అరాచకాలను గమనిస్తోందని అర్వింద్ హెచ్చరించారు. తాము భరతమాతకు బానిసలమే తప్ప లిక్కర్ మాఫియాకు కాదని ఘాటుగా స్పందించారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పాత్రను ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. కేసీఆర్ కవితకు రోబోలా కనిపిస్తున్నారా లేక రజనీకాంత్ లా కనిపిస్తున్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన తండ్రిని తానే నియంత్రిస్తానన్నట్టుగా ఆమె మాటలు ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర లేదని మాట్లాడటం కవిత అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

Advertisement

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని అర్వింద్ స్పష్టం చేశారు. పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇవ్వకుంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చేదా అని ఆయన ప్రశ్నించారు. చరిత్ర తెలియకుండా కవిత మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ చేసిన పోరాటాల వెనుక కూడా బీజేపీ అండదండలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్త పార్టీ పేరుతో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కవిత రాజకీయంగా కనుమరుగవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.

మరోవైపు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. తేజస్వీ సూర్య చెప్పిన వాస్తవాలను జీర్ణించుకోలేక కవిత అనవసర రభస చేస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలను పింక్ బూతద్దాలు పెట్టుకుని చూడటం మానేయాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని.. కుటుంబ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని వివరించారు. కవిత ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు ఆమెను నమ్మే స్థితిలో లేరని అర్వింద్ స్పష్టం చేశారు.

Advertisement

ALSO READ: TRS నయా గర్జన.. ఉచిత విద్య, వైద్యం.. 4 లక్షల ఉద్యోగాలే కవిత ప్రధాన హామీలు

Related News

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. చివరి తేది..?

రాజ్యాంగానికి తీవ్ర ముప్పు..13 కోట్ల ఓట్లు మాయం.. కేంద్రంపై విరుచుకుపడ్డ మధుయాష్కి!

‘కేసీఆర్ ఫామ్ హౌస్ నీళ్లను రైతులకు ఇస్తాం’.. ఎంపీ చామల సంచలన హామీ!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×