E-Paper
Advertisement

BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?

BJP : బీజేపీ లేకపోతే టీడీపీ, జనసేన ఉండదా?.. గతం మరిచారా?
Advertisement

ఏపీలో కూటమి సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ పార్టీల మనుగడపై కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. తెలుగుదేశం జనసేన, బీజేపీ పార్టీలు ప్రస్తుతం కూటమిగా ఏర్పడి అధికారాన్ని పంచుకుంటున్నాయి. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత బీజేపీతో విభేదించారు. పొత్తు తెగదెంపులు చేసుకున్నారు.కారణం రాష్ట్రంలో ఎదిగేందుకు బీజేపీ తమను అడ్డుపెట్టుకుంటున్నదని ఆరోపించారు. సమాఖ్య వ్యవస్థలను బీజేపీ కాల రాస్తోందని, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారుతో విభేదించారు. దీంతో కేంద్రంలోని మోడీ సర్కార్.. చంద్రబాబుకు వ్యతిరేకంగా పావులు కదిపింది.

ప్రాంతీయ పార్టీలకు శరాఘాతం..

బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు ఆ తర్వాత మనుగడ సాగించడం కష్టమనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రాష్ట్రం ఏదైనా గ్రౌండ్ లెవల్లో బలపడేందుకు లోకల్ పార్టీస్ సహాయాన్ని బీజేపీ తీసుకుంటుంది. చాప కింద నీరులా తన పార్టీని విస్తరిస్తుంది. ఆ తర్వాత లోకల్ పార్టీని తొక్కేసి అక్కడ శాశ్వతంగా పాతుకుపోతుంది. బిహార్‌లో అదే జరిగింది. మహారాష్ట్రలోనూ అదే జరిగింది. ప్రస్తుత దక్షిణాదిపై కన్నేసిన బీజేపీ తెలంగాణలో నెమ్మెదిగా తన పట్టును పెంచుకుంటున్నది. ఇక బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను బద్దలు గొట్టి గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం అధికారం దక్కించుకునేందుకు బెంగాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహి
స్తున్నది.

2019లో వైసీపీతో పరోక్ష జట్టు

Advertisement

ఇదే సూత్రాన్ని నేటికీ బీజేపీ ఫాలో అవుతున్నది. 2014లో చంద్రబాబు మాట వినలేదని.. ఆయన్ను దారికి తెచ్చకోవడానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి, వైసీపీ పవర్‌లోకి రావడానికి కృషి చేసినట్టు టాక్. ఇక 2023లో చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ ఒప్పుకోలేదు. ఎందుకంటే 2014లో బాబు చేసింది వారు మర్చిపోలేదు. అదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం చేయించి చంద్రబాబుకు, కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సమయోధ్య కుదిర్చారు. వైసీపీ పాలన మీద వ్యవతిరేక రావడం.. జనసేనాని, టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేయడంతో బాబు మరోసారి సీఎం అయ్యారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. నిధులు, అనుమతుల విషయంలో ఆయన హవా నడుస్తున్నది. కేంద్రంలో బీజేపీకి సరిపడా మెజార్టీ లేనందున చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు. ఇటీవల అమరావతికి చట్టబద్ధత కూడా బాబు ఫోర్స్ వల్లే కేంద్రం ఆమోదించింది అనడంలో సందేహం లేదు.

పంపకాల్లో తేడాల వల్లే కొత్త పార్టీనా? కవితకు ఎంపీ చామల కౌంటర్

Advertisement

అయితే, బీజేపీ తో పొత్తు అంటే పులి మీద స్వారీ చేసినట్టే అని ఇతర పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల సీపీఐ నారాయణ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఎందుకంటే ముందు పొత్తుతో మొదలై ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలను అమాంతం మింగేయడం బీజేపీకి అలవాటు అని ఇండియా కూటమిలోని పార్టీలు సైతం విమర్శలు చేస్తున్నాయి. ఈ పొత్తు ఇలాగే కొనసాగితే బీజేపీ లేకుండా టీడీపీ, జనసేన పార్టీలు ముందుకు వెళ్లలేవని.. అలాంటి పరిస్థితిని మోడీ -షా క్రియేట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మున్ముందు ఆ పార్టీల మనుగడ కష్టం అవుతుందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

 

 

 

 

 

 

 

Related News

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

వెలిగొండకు వైఎస్సార్ వెలుగైతే.. చంద్రబాబు చీకటి.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

గోదావరి నీళ్లు నల్లమల సాగర్‌కు రావాలి.. మాట ఇచ్చాను, ప్రాజెక్టు పూర్తి చేశాం-సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×