E-Paper
Advertisement

డొమెస్టిక్ కంటే కమర్షియల్ ధరల పెంపు ప్రమాదకరం: ఎంపీ మల్లు రవి

డొమెస్టిక్ కంటే కమర్షియల్ ధరల పెంపు ప్రమాదకరం: ఎంపీ మల్లు రవి
Advertisement

Mallu Ravi: మే 1వ తేదీ నుంచి పెట్రోలియం కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం పెంచడం దేశవ్యాప్తంగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెను ప్రభావం చూపుతోంది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై ఏకంగా రూ. 993 పెంచడంతో ఒక్కసారిగా ధరలు మూడు వేల మార్కును దాటేశాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రికార్డు స్థాయిలో రూ. 3,069కి చేరింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి దీనిపై తీవ్రంగా స్పందించారు.

పెట్రోలియం.. సహజ వాయువు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు.. ఎంపీ డాక్టర్ మల్లు రవి ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. గృహ అవసరాలకు వాడే గ్యాస్ ధరల పెంపు కంటే కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు అత్యంత ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరిగితే దాని ప్రభావం కేవలం కొనుగోలుదారులపైనే కాకుండా.. హోటళ్లు.. రెస్టారెంట్లు.. ఇతర చిరు వ్యాపారాలపై ఆధారపడే సామాన్య వినియోగదారులపై నేరుగా పడుతుందని ఆయన విశ్లేషించారు. దీనివల్ల నిత్యావసరాలు.. ఆహార పదార్థాల ధరలు పెరిగి సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి వంచించిందని మల్లు రవి మండిపడ్డారు. ధరలు పెంచబోమని గతంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఇచ్చిన హామీని మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. ఇచ్చిన మాటను తప్పడం ద్వారా బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. అంతర్జాతీయంగా ధరల సాకు చూపిస్తూ దేశీయంగా ప్రజల నడ్డి విరవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశ ప్రయోజనాలను.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పెంచిన కమర్షియల్ గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల వల్ల వ్యాపార రంగాలు కుదేలయ్యే ప్రమాదం ఉందని.. ఇది పరోక్షంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. కేంద్రం మొండివైఖరిని వీడకపోతే ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Read Also: బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్డీఐ.. కేంద్రం నోటిఫై.. ఎల్ఐసీలో మాత్రం!

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×