E-Paper
Advertisement

మమ్మల్ని చావనివ్వండి కలెక్టర్ గారు.. పురుగుల మందు డబ్బాతో వృద్ధ దంపతుల ఆవేదన..!

మమ్మల్ని చావనివ్వండి కలెక్టర్ గారు.. పురుగుల మందు డబ్బాతో వృద్ధ దంపతుల ఆవేదన..!
Advertisement

Land Dispute: స్వేచ్ఛ బ్యూరో: తన భూమిని అమ్ముకోనివ్వండి పురుగుల మందు డబ్బా తో వృద్ధ దంపతులు నిరసన వ్యక్తం చేసిన ఘటన చివ్వేంల మండలం అక్కలదేవిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. శనివారం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన కొంగలరాములు, లచ్చమ్మ దంపతులు పురుగుల మందు డబ్బా పట్టుకొని నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. బండమీది చందుపట్ల రెవెన్యూ వారిలో 264 సర్వే నెంబర్ లో తనకు, తన కుమారుడి పేరున (ఎకరం ఆరు కుంటలు) 1. 06కుంటల భూమి కలదని తెలిపారు. అనారోగ్యాల కారణంగా అప్పుల పాలు కావడంతో భూమిని అమ్ముకుంటుంటే,అమరగాని అబ్బులు, కొంగల రామలింగయ్య, (ప్రభుత్వ ఉపాధ్యాయుడు)మరి కొంతమంది వ్యక్తులు, ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

భార్యకు పక్షవాతం..

వారం రోజుల క్రితమే షుగర్ కారణంగా తన కాలివేలును తీసివేశారని తెలియజేశారు. హాస్పిటల్ లో చూపించుకోవడానికి డబ్బులు లేక ఇంటికి వచ్చినట్లు తన భార్య కూడా పక్షవాతంతో బాధపడుతున్నట్లు రాములు తెలిపారు. తన భూమిని అమ్ముకొనివ్వడం లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ను 6-4-2026 తారీఖున మరియు 20-4-2026న కలిసి తన బాధను తెలియజేసినట్లు తెలిపారు. అదేవిదంగా 6-4-2026న జిల్లా ఎస్పీ నరసింహ ని కలిసి సమస్య ను తెలియజేసి, ప్రాణభయం ఉన్నదని తమకు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపారు. కాని ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. తన తండ్రి దగ్గరి నుంచి వారసత్వంగా వస్తున్న భూమిని అమ్ముకోకుండా అడ్డుపడుతున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేక పొతే పురుగుల మందు త్రాగి తన కుటుంబం మొత్తం చనిపోవడమే దిక్కన్నారు.

Advertisement

Also read: Nasser Hussain: రూ.100 కోట్లు కాదు, బాబ‌ర్ ఆజం కాళ్లు ప‌ట్టుకున్నా..ఐపీఎల్ లోకి రాడు

ఆవేదన వ్యక్తం..

ప్రభుత్వ ఉపాధ్యాయుడైయుండి డిసెంబర్ నెలలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో రాజకీయ నాయకుడిగా కొంగల రామలింగయ్య ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు ఫోటోల రూపంలో ఆధారాలను చూపించారు. ప్రభుత్వఉపాధ్యాయుడా లేక రాజకీయ నాయకుడా అని ప్రశ్నించాడు. అతనిపై వెంటనే జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. వారు తన కుటుంబ సభ్యులందరినీ చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు నా కుటుంబ సభ్యులకు ప్రాణభయం ఉందని ఏ సమయంలో చంపుతారోనని రోదించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఏఐసిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి జోక్యం చేసుకొని తమ భూమిని అమ్ముకోని హాస్పటల్లో చూపించుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. మా ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. మాకు న్యాయం జరగక పోతే మా కుటుంబసభ్యులoదరము పురుగుల మందు త్రాగి చనిపోవడానికి అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

Also read: మరో సంచలన రికార్డును సొంతం చేసుకున్న తెలంగాణ సర్కార్..?

Related News

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

Big Stories

Advertisement
×