E-Paper
Advertisement

Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!

Municipal Polling: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్​.. ఇబ్రహీంపట్నంలో దొంగ ఓట్ల కలకలం!
Advertisement

Municipal Polling: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లు, అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసింది. రంగారెడ్డిలోని 6, మేడ్చల్లోని 3, వికారాబాద్​లోని 4 మున్సిపాలిటీలో జరిగిన పొలింగ్ విధానంపై ఎప్పటికిప్పుడు జిల్లా కలెక్టర్, ఆయా పరిధిలోని పోలీసు అధికారులు పర్యవేక్షించారు. సమస్యత్మాక ప్రాంతాలను పోలీస్​ కమీషనర్లు పర్యటించి స్ధానికులను పరిస్థితులపై ఆరా తీశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడలో నా ఓటు వేశారని బాధితురాలు బహిరంగంగా వెల్లడించారు.

83.99 శాతం పొలింగ్

దొంగ ఓట్లు వేస్తున్నారని చెప్పడంతో స్ధానికంగా కలకలం రేగింది. అదేవిధంగా అలియాబాద్​ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు బీజేపీ అభ్యర్ధి నకిలీ వెండి నాణేలు పంపిణీ చేసి ఓటర్లను మోసం చేశారనే దుమారం రెగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటింగ్ శాతం పెరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికి రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో తగినంత పోలింగ్ కాలేదని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలుంటే 78.52, వికారాబాద్​లో 4 మున్సిపాలిటిల్లో 71.82, మేడ్చల్ల్లో 3 మున్సిపాలిటీలుంటే 83.99 శాతం చోప్పున పొలింగ్​ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Also Read: Municipal Elections: మున్సిపల్ పోరు.. జోరుగా పోలింగ్.. 73.01 శాతంగా నమోదు

అత్యధికంగా మేడ్చల్ టాప్

మూడు జిల్లాలో 13 మున్సిపాలిటీలుంటే మేడ్చల్​ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో నమోదైన పోలింగ్​ టాప్​లో ఉంది. ఆరు, నాలుగు మున్సిపాలిటీలున్నప్పటికి 80శాతం పోలింగ్ నమోదు కాలేదు. ఒకప్పుడు ఈ మున్సిపాలిటీలన్ని రూరల్ ప్రాంతాలే… ప్రస్తుతం కూడా ఈ ప్రాంతాలు గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది. కోర్​ సిటీ ప్రాంతాల్లో పొలింగ్ శాతం 50శాతం దాటటం గగణమని మాట్లాడుకుంటారు. కానీ ప్రస్తుత మున్సిపాలిటీ గ్రామీణ ప్రాంతాల ప్రభావం ఉంటుంది కనుక అత్యధిక శాతం పోలింగ్​ నమోదు కావాల్సి ఉండేదని అధికారులే చర్చించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో అమన్​గల్​, చేవెళ్ల 80శాతం దాటితే… ఇబ్రహీంపట్నం, మొయినాబాద్​, శంకర్​పల్లి, షాద్​నగర్​ 79 శాతం దాటలేదు. అదే వికారాబాద్​ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలుంటే పరిగి 77శాతం, కొడంగల్, వికారాబాద్​ 75 శాతం లోపు, తాండూర్​ 67శాతం పోలింగ్​తోనే సరిపెట్టుకుంది. మేడ్చల్​ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మూడుచింతలపల్లి 89శాతం, ఎల్లంపేట్లో 83, అలియాబాద్​లో 79.62 శాతం చోప్పున పొలింగ్​ నమోద్ అయ్యింది. పరిగి మున్సిపాలిటీలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఒక శాతం అధికంగానే ఓటింగ్లో పాల్గోన్నారు.

Advertisement

Also Read: Nikhil: ‘స్వయంభు’ కథ ఎవరిదో చెప్పిన నిఖిల్.. 1000 ఏళ్ల క్రితం అల్లరిచిల్లరిగా తిరిగే అతని కథంట!

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×