BigTV English

MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. న్యూ ట్విస్ట్, హత్యాయత్నం కేసు

MLA Arekapudi Gandhi: ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.. న్యూ ట్విస్ట్, హత్యాయత్నం కేసు

MLA Arekapudi Gandhi: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపైనా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ క్రమంలో తన అనుచరులతో కౌశిక్ ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ.


బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ- కౌశిక్‌రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేతలిద్దరి మధ్య ఫిరాయింపుల వ్యవహరం ముదిరిపాకాన పడింది. ఇద్దరు ఓకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గొడవకు దిగడంతో వీరిని ఆపే ప్రయత్నం చేయలేదు ఆ పార్టీ. నేతలను పిలిచి సముదాయించే ప్రయత్నం చేయలేదు. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది.

ALSO READ: రష్యా ఆర్మీ చెర నుంచి బయటకు తెలంగాణ వ్యక్తి.. దాదాపు ఎనిమిది నెలల తర్వాత..


ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ- కౌశిక్‌రెడ్డిల రెండో రోజూ మాటలయుద్ధం ముదిరింది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. పార్టీ మందలింపుతో కౌశిక్‌రెడ్డి మాటల వేడి తగ్గినట్టు కనిపిస్తోంది. అమెరికా నుంచి ఓ వ్యక్తి ఆయన్ని గట్టిగా మందలించినట్టు వార్తలు వస్తున్నాయి.

ఇంటిపై దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అరికపూడి గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేస్ నమోదు చేశారు. గాంధీతోపాటు, అతని కుమారుడు, సోదరుడి‌పై కేసు రిజిస్టర్ అయ్యింది. వీరికితోడు ఇద్దరు కార్పొరేటర్లు పేర్లను చేర్చారు. వెంకటేష్ గౌడ్‌తో పాటు, మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్‌లను నిందితులుగా చేర్చారు పోలీసులు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇరువురు ఎమ్మెల్యేలు గులాబీ బాస్ మందలించినట్టు వార్తలు వస్తున్నాయి. గాంధీ-కౌశిక్ వ్యవహారంపై ఇద్దరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

Related News

Hyderabad rains update: హైదరాబాద్ వర్షాల అలర్ట్.. మరికొద్ది గంటల్లో దంచుడే.. బయటికి వెళ్లొద్దు!

Telangana floods: 48 గంటల్లో 1,646 ప్రాణాలు సేఫ్.. ఈ అధికారులకు సెల్యూట్ కొట్టాల్సిందే!

Telangana floods: మీ రహదారులకు గండి పడిందా? రోడ్లు దెబ్బతిన్నాయా? వెంటనే ఇలా చేయండి!

Telangana Police: కుళ్లిన శవాన్ని మోసిన పోలీస్ అధికారి.. తెలంగాణలో హృదయాన్ని తాకిన ఘటన!

Telangana rains: భారీ వర్షాల దెబ్బ.. తెలంగాణలో భారీగా అంగన్వాడీ భవనాలకు నష్టం!

Vinayaka Chavithi: వినాయకుని పూజ కోసం రచ్చ.. ఏకంగా పూజారినే ఎత్తుకెళ్లారు!

Big Stories

×