BigTV English

Telangana Men Rescued: రష్యా ఆర్మీ చెర నుంచి బయటకు తెలంగాణ వ్యక్తి.. దాదాపు ఎనిమిది నెలల తర్వాత..

Telangana Men Rescued: రష్యా ఆర్మీ చెర నుంచి బయటకు తెలంగాణ వ్యక్తి.. దాదాపు ఎనిమిది నెలల తర్వాత..

Telangana Men Rescued: ఉద్యోగం కోసం రష్యా వెళ్లాడు తెలంగాణకు చెందిన ఓ యువకుడు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు విషయం తెలిసింది. తాను ఏజెంట్ల చేతిలో మోసపోయానని తెలుసు కున్నాడు. అక్కడి నుంచి బయట పడలేకపోయాడు. అదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య వార్ భీకరంగా జరుగుతోంది. ఇండియా నుంచి వెళ్లినవారిని సైనికులుగా ఉపయోగించుకుంది. వారిలో తెలంగాణకు చెందిన సోఫియాన్ కూడా ఒకడు. చివరకు ఇరుదేశాల దౌత్యం కారణంగా బయటపడ్డాడు. ఎనిమిది నెలల తర్వాత పేరెంట్స్ చూసిన ఆనందంలో కంటతడి పెట్టాడు.


సోఫియాన్.. వయస్సు 24 ఏళ్లు. సొంతూరు నారాయణ్‌పేట్. ఉద్యోగం నిమిత్తం ఏజెంట్ ద్వారా రష్యాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మోసపోయానని తెలుసుకున్నాడు. ఆయనతోపాటు చాలామంది మోసపోయారు.

రష్యా లాంగ్వేజ్‌లో అగ్రిమెంట్ పేపర్స్‌పై సంతకాలు చేయించి అక్కడి సైన్యంలో చేర్పించాడు ఏజెంట్. వారిని రష్యా ఆర్మీ తమ వద్ద పెట్టుకుంది. వారిలో సోఫియాన్ ఉన్నాడు. వారికి ట్రైనింగ్ ఇచ్చి బోర్డర్‌లో కాపలా పెట్టింది.  అప్పటికే హైదరాబాద్‌కి చెందిన ఓ యువకుడు చనిపోవడంతో.. సోఫియాన్ కుటుంబంలో ఆందోళన మొదలైంది.


తమకు కొడుకును ఇండియాకు రప్పించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. అదే సమయంలో రష్యా ఆర్మీ తమను బంధించి ఉక్రెయిన్ బోర్డర్‌లో కాపాల పెట్టిందని, ఆరు నెలల కిందట వీడియోలు పేరెంట్స్ పంపాడు. దీంతో సోఫియాన్ కుటుంబ సభ్యుల్లో భయం రెట్టింపు అయ్యింది.

ALSO READ: హైడ్రా రద్దు చేయాలని పిటిషన్.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

భారత్-రష్యాల ఒప్పందంలో భాగంగా  ఐదుగురు భారతీయులను విడుదల చేశారు. వారిలో సోఫియాన్ కూడా ఉన్నాడు. రెండు రోజుల కిందట ఇండియాకు చేరుకున్న ఆ యువకుడు, శుక్రవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగారు. దీంతో సోఫియాన్ చూసి ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ కన్నీటి పర్యంతమైంది. శంషాబాద్ నుంచి బస్సులో నారాయణపేట్‌కు చేరుకున్నాడు. కొడుకు క్షేమంగా రావడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది.  మరో 70 మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు.

 

Related News

Komatireddy Rajagopalreddy: హమ్మయ్య..! రాజగోపాల్ రెడ్డి ఇగో చల్లారినట్టేనా?

Weather News: కుండపోత వర్షం.. సాయంత్రం నుంచి ఈ జిల్లాల్లో దంచుడే.. ఇంట్లోనే ఉంటే బెటర్

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Big Stories

×