Hero Nani coming with Hit 3 movie in 2025 may: నా..నీ అనే భేషజాలు లేని నటుడు నాని. తన సహజ నటనతో అచ్చంగా మన ఇంట్లో మనిషి అన్నట్లుంటారు. నాని పెద్దగా రికార్డుల జోలికి వెళ్లరు. అలానే పాన్ ఇండియా అంటూ భారీ బడ్జెట్ సినిమాలకు కూడా దూరంగానే ఉంటారు. రీజినల్ లాంగ్వేజ్ పరంగా ప్రాంతీయ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మినిమం గ్యారెంటీ హిట్ హీరో అనిపించుకుంటూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా రిలీజయిన సరిపోదా శనివారం మూవీ కలెక్షన్లపై భారీ వర్షాలు, వరదలు, తుపానులు దెబ్బకొట్టాయి. వాస్తవానికి ఆ మూవీకి వచ్చిన హిట్ టాక్ తో ఈజీగా వంద కోట్లు వచ్చేస్తుందని సినీ వర్గాలు భావించాయి. అందుట్లో దసరా, హాయ్ నాన్న మూవీస్ హిట్ తో ఈ సినిమా కూడా హిట్ రేంజ్ అందుకుని నానికి హ్యాట్రిక్ విజయాలను అందిస్తుందని అంతా భావించారు. అయితే సరిపోదా శనివారం బయ్యర్లకు భారీ నష్టాలను అయితే తేలేదు కానీ..కేవలం కొద్ది పాటి నష్టాలతో బయటపడింది. ఓవరాల్ గా ఈ మూవీ నో హిట్..నో గెయిన్ అన్న మాదిరిగా విజయాన్ని అందుకుంది.
ప్రొడ్యూసర్ గా సక్సెస్
నాని నిర్మాతగా మారి అభిరుచి కలిగిన సినిమాలు రూపొందించారు. వాల్ పోస్టర్ అనే బ్యానర్ పై సూపర్ హిట్ మూవీస్ నిర్మించడమే కాదు..కొత్త దర్శకులకు అవకా
శం కూడా ఇచ్చారు. నాని తన వాల్ పోస్టర్ బ్యానర్ పై ‘ఆ’ మూవీని నిర్మించారు. దానికి కొత్తగా అప్పుడే వచ్చిన ప్రశాంత్ వర్మకు అవకాశం ఇచ్చారు. హనుమాన్ లాంటి పాన్ ఇండియాను రూపొందించారు ప్రశాంత్ వర్మ. తర్వాత హిట్ 1, హిట్ 2 సిరీస్ ని రూపొందించారు. అవి రెండూ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. వీటిని రూపొందించిన దర్శకుడు శైలేష్ కొలను.
వాల్ పోస్టర్ వెనక కథ
వీటన్నింటికన్నా ముందుగా నాని నిర్మాణ భాగస్వామిగా ఉండి ‘డి ఫర్ దోపిడి’ అనే మూవీ తీశారు. తర్వాత సొంతంగా వాల్ పోస్టర్ అనే బ్యానర్ తో సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే వాల్ పోస్టర్ పేరు వెనక ఓ ఆసక్తికరమైన స్టోరీ చెప్పుకొచ్చారు నాని. తాను బ్యాచిలర్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ అమీర్ పేటలో ఉండేవారట. నాని అక్కడ దగ్గరలో ఉన్న సత్యం థియేటర్ కు వెళ్లే దారిలో ఓ సందు ఉండేది. ఆ గోడపై రకరకాల సినిమాల పోస్టర్లు అతికించేవారు. నాని ప్రతి నిత్యం ఆ వాల్ పోస్టర్లు చూసుకుంటూ వెళ్లేవారట. తనకు మొదటినుంచి కూడా సినిమాలన్నా, వాటికి సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్లు అన్నా విపరీతమైన ఇష్టమని చెప్పుకొచ్చారు. ఇప్పుడంటే టీజర్లు, ట్రైలర్లు వచ్చాయి కానీ..ఒకప్పుడు ఈ వాల్ పోస్టర్లు చూసే జనం సినిమాలకు వెళ్లేవారు. ఈ వాల్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తించేవి. అందుకే దానిమీద మమకారంతో నాని వాల్ పోస్టర్ అని పేరు పెట్టుకుని..అదే బ్యానర్ లో సినిమాలు తీస్తున్నారు. అయితే హిట్ 1 మూవీని విశ్వక్ సేన్ తో, హిట్ 2 మూవీని అడవి శేష్ తో రూపొందించిన నాని ఈ సారి హిట్ 3 మూవీలో తానే హీరోగా నటిస్తున్నారు.
సమ్మర్ బొనాంజా
హిట్ 3 మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లో మొదలయింది. అర్జున్ సర్కార్ అనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నాని నటిస్తున్నారు. అయితే హిట్ సిరీస్ లో మూడో భాగంగా వస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మే 1న విడుదల అవుతుందని..తప్పకుండా పేరుకు తగ్గట్లుగా హిట్ ఇస్తానని నాని అంటున్నారు. సమ్మర్ ట్వీట్ గా ఈ సినిమా అన్నివర్గాలవారినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని నాని హిట్ మూవీపై హింట్ ఇచ్చేశారు.