BigTV English

Murder : రెచ్చిపోయిన సైకోలు .. సాయం చేసిన పాపానికి యువకుడు బలి..

Murder : రెచ్చిపోయిన సైకోలు .. సాయం చేసిన పాపానికి యువకుడు బలి..

Murder : సొసైటీలో సైకోలు చెలరేగిపోతున్నారు. అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. వారి ఉన్మాదాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. తాజాగా హైదరాబాద్‌ శివారు నార్సింగ్ లో ఒక యువకుడి ప్రాణాలు తీశారు.


ఏం జరిగిందంటే..?
సోమవారం అర్ధరాత్రి నార్సింగి సమీపంలోని జన్వాడలో ఓ పెట్రోల్‌ బంకు వద్దకు కారు వచ్చి ఆగింది. కారులో పెట్రోల్‌ పోయాలని అందులోని యువకులు కోరారు. బంకు మూసి వేశామని అక్కడ పనిచేసే సిబ్బంది చెప్పారు. కారులో పెట్రోల్ అయిపోయిందని చాలా దూరం వెళ్లాలని కారులో ఉన్న ముగ్గురు యువకులు వేడుకున్నారు. దీంతో పెట్రోల్ బంకు సిబ్బంది కనికరించారు. కారులో పెట్రోల్ నింపారు.

కారులో పెట్రోలు నింపుకున్న తర్వాత ఆ ముగ్గురు యువకుల అసలు రూపం బయటపడింది. బిల్లు చెల్లింపు చేసే సమయంలో కారులోని యువకులు తమ కార్డును ఇచ్చారు. స్వైప్‌ మెషిన్‌ లేదని.. నగదు ఇవ్వాలని పెట్రోల్ బంకు క్యాషియర్‌ కోరారు. దీంతో కారులోని యువకులు క్యాషియర్ తో గొడవకు దిగారు. అతడిపై దాడికి తెగబడ్డారు. క్యాషియర్‌ను కొట్టొద్దంటూ పెట్రోల్ బంకులో పనిచేసే సంజయ్‌ అనే యువకుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో సంజయ్‌పైనా దాడి చేశారు. ఆ యువకుల దాడిలో తీవ్రంగా గాయపడి సంజయ్ అక్కడే కుప్పకూలిపోయాడు. పెట్రోల్ బంకు సిబ్బంది సంజయ్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. పెట్రోల్‌ బంకు సమయం ముగిసినా కారులో పెట్రోల్ పోసి చేసిన సాయమే ఆ యువకుడి ప్రాణాలను తీసింది.


పెట్రోల్‌ కోసం కారులో వచ్చిన యువకులు ఘటనా స్థలి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.ఈ ఘటనపై నార్సింగ్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను జన్వాడ గ్రామానికి చెందిన నరేందర్‌, మల్లేశ్‌, అనూప్‌లుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పెట్రోల్ బంకులు, టోల్ ప్లాజా వద్ద తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మద్యం, గంజాయి మత్తులో సైకోలు రెచ్చిపోతున్నారు. అక్కడ పనిచేసే సిబ్బందిపై దాడులకు తెగబడి ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి దుర్మాగుల ఆగడాలు ఆగేదెలా..?

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×