BigTV English

Musi River Victims: బస కూడా రెడీ చేశాం.. ఒక్కరోజు మాతో ఉండండి.. కేసీఆర్, కేటీఆర్, ఈటెలకు రివర్స్ పంచ్.. వీడియో వైరల్

Musi River Victims: బస కూడా రెడీ చేశాం.. ఒక్కరోజు మాతో ఉండండి.. కేసీఆర్, కేటీఆర్, ఈటెలకు రివర్స్ పంచ్.. వీడియో వైరల్

Musi River Victims: అయ్యా నేతలారా.. మీ రాక కోసం మేము వెయిటింగ్. మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మీరందరూ రండి.. ఒక్కరోజు మాతోపాటు కలిసి ఉండండి. మీకోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాం. మీరందరూ తికమక చెందకుండా.. మీకు బస ఏర్పాటు చేసిన గదుల వద్ద మీ చిత్రాలను ఉంచాం. ఇక రండి.. ఒక్కరోజు మాతోపాటు ఉండండి. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు మూసీ పరివాహక ప్రజలు. ఎవరిని ఉద్దేశించో తెలుసా.. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, బిజెపి నేత ఈటెలలనే.


మూసీ పునరుజ్జీవం కోసం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి అన్యాయం జరగకుండా, మూసీ నది ప్రక్షాళన పేరుతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సర్వే బృందాలు సర్వే చేయగా, నిరంతరం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు నిర్వహిస్తూ, మూసీ పునరుజ్జీవానికి కట్టుబడి ముందడుగు వేస్తున్నారు.

మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా డబుల్ బెడ్ రూములు అందజేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారు. అంతేకాదు చాలావరకు మూసీ పరివాహక ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్ల ను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం కేటాయిస్తున్న డబుల్ బెడ్ రూమ్ గృహాలలోకి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే మూసీ పునరుజ్జీవం పై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మూసీ నది పేరుతో అవినీతికి పాల్పడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ సైతం విమర్శించారు.


తాజాగా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో సీఎం మాట్లాడుతూ.. మూసీ పునరుజ్జీవంలో వెనకడుగేసే ప్రసక్తే లేదని, పరివాహక ప్రాంత ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు భారీ మార్కెట్ నిర్వహించేలా కూడా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని సీఎం అన్నారు. అంతేకాదు తాను మూసీ ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, కేటీఆర్, హరీష్ పాల్గొనాలని, అప్పుడే స్థానిక ప్రజలను మూసీ అభివృద్దిపై అడుగుదామంటూ సవాల్ విసిరారు.

ఇలా మూసీ పునరుజ్జీవం కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శల పర్వం సాగుతుండగా, మూసీ పరివాహ ప్రజల పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. అయ్యా కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్ గార్లూ.. ఒక్కరోజు మాతో కలిసి మూసీ ఒడ్డున ఉండి చూడండి.. మా బాధలు మీకు తెలుస్తాయి.. మీ కోసం ప్రత్యేక బస కూడా ఏర్పాటు చేశాం.. అంటూ మూసారాంబాగ్ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడి  కంపు మీకు తెలుస్తుంది. మీరు వచ్చేందుకు సిద్దమే కదా అంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Also Read: MLA Raja Singh: ఆ టపాసుల వెనుక కుట్ర.. అస్సలు కొనుగోలు చేయవద్దు.. ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరిక

అక్కడి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు. వీరి కోసం చేసిన బస ఏర్పాట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ మంచం, ఒక బబుల్, అక్కడే బాత్ రూమ్స్, ఇలా ఏర్పాట్లు చేసినట్లుగా ఉంది. మాకు ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లు కేటాయిస్తే స్వచ్ఛందంగా ఇక్కడ ఇళ్లను ఖాళీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అలాంటప్పుడు దీనిపై రాజకీయం ఎందుకంటూ వారు ప్రశ్నించడం గమనార్హం. మరి మూసీ పరివాహక ప్రజల పిలుపుకు కేసిఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×