BigTV English

Nagarjuna Sagar: సాగర్ కు పోటెత్తిన వరద.. కూలిన రిటైనింగ్ వాల్

Nagarjuna Sagar: సాగర్ కు పోటెత్తిన వరద.. కూలిన రిటైనింగ్ వాల్

Nagarjuna Sagar Gates Opened: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. కొద్దిరోజులుగా ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతూ వస్తోంది. వరద ప్రవాహం మరింత పెరగడంతో.. అధికారులు డ్యామ్ మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 22 గేట్లను 5 అడుగుల మేర, 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 2 లక్షల 53 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.


సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 585.30 అడుగులు వద్ద కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 298.30 టీఎంసీలుగా ఉంది.

మరోవైపు సాగర్ వద్ద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆగస్టు 1నే ఈ ఘటన జరగ్గా.. అధికారులు దానిని చాలా రహస్యంగా ఉంచారు. సాగర్ లో పనిచేసే వర్కర్లు.. షిఫ్టు మారే సమయంలో ఈ ఘటన జరగడంతో.. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. పంప్ హౌస్ మొత్తం జలదిగ్బంధమైంది. కాగా.. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఈ పథకాన్ని చేపట్టారు.


Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×