E-Paper
Advertisement

Nakrekal Congress Meeting : కాంగ్రెస్‌కు కోటి 50 లక్షల ఓట్లు.. రేవంత్ రెడ్డి ధీమా..

Nakrekal Congress Meeting : కాంగ్రెస్‌కు కోటి 50 లక్షల ఓట్లు.. రేవంత్ రెడ్డి ధీమా..

Nakrekal Congress Meeting : తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నకిరేకల్ కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్.. కాంగ్రెస్ కు కోటి 50 లక్షల ఓట్లు వస్తాయని స్పష్టం చేశారు. నల్గొండను తల్చుకుంటే.. తనకు వెయ్యి ఏనుగుల బలం వస్తుందన్నారు.

నల్గొండ గడ్డపై గులాబీ జెండా కనబడనీయవద్దని రేవంత్ పిలుపునిచ్చారు. ఆ పార్టీకి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్కసీటు కూడా రాకూడదన్నారు. పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వవద్దని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

దోచుకుతినే బకాసురుడు.. ఫాంహౌజ్‌లో పడుకునే కుంభకర్ణుడు కేసీఆర్ అని రేవంత్ విమర్శించారు. ఇసుక మీద ఎవరైనా మేడిగడ్డ లాంటి బ్యారేజీ కడతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలపై రూ. 6 లక్షల కోట్ల అప్పు పెట్టారని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో పాలన కంటే బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ ప్రజలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు.

సభా వేదికపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ప్రశంసలతో రేవంత్ ముంచెత్తారు. తెలంగాణ వచ్చే వరకు పదవి తీసుకోకుండా కోమటిరెడ్డి ఆదర్శంగా ఉన్నారని కితాబిచ్చారు. ఆయనకు పేరు వస్తుందనే ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును పూర్తి చేయలేదని కేసీఆర్ పై విమర్శలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాను తలుచుకుంటే..ఇక కాంగ్రెస్ కు తిరుగుండదన్నారు.

హెలికాప్టర్ సమస్య ఉన్నా రోడ్డుమార్గంలో తుంగతుర్తి వచ్చాను. పేదవాడి కష్టాలు కేసీఆర్ కు తెలియదు. నీళ్లు, నిధులు , నియామకాల పేరిట పదేళ్లుగా కేసీఆర్ ప్రజలను మోసం చేశారు.

ఆ తర్వాత తుంగతుర్తిలో కాంగ్రెస్ విజయభేరి సభకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ నిరుద్యోగులను నిండా ముంచారని మండిపడ్డారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం నియామకాలు జరిగాయన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని రేవంత్ సెటైర్లు వేశారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×