Big Stories

Judge Suicide Attempt: ఉరి వేసుకుని నాంపల్లి కోర్టు జడ్జి ఆత్మహత్య.. భార్యతో గొడవే కారణం..!

Judge Sucide Attempt
Judge Sucide Attempt

Judge Suicide Attempt in Hyderabad: ఇటీవల చిన్న, పెద్ద అనే తేడాలేకుండా మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఏదో ఒక కారణంగా ప్రాణాలు తీసుకునేందుకు కూడా వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఈ మధ్య కుటుంబ కలహాల సమస్యలు తరచూ పెరిగిపోతున్నాయి. భార్య, భర్తల మధ్య అవగాహన లోపం నశించడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భార్య భర్తను హింసించడం, భర్త భార్యను హింసింస్తున్న కేసులు తరచూ కోర్టు తీర్పుల్లో వింటూనే ఉన్నాం. అయితే మారుతున్న కాలంతో పాటు సమస్యలు కూడా తలకిందులు అవుతున్నాయి. అప్పట్లో భర్తలు భార్యలను వేధిస్తున్న కేసులు, గృహహింస వంటివి ఉండగా.. ఇప్పుడు భార్యలే భర్తలను వేధిస్తున్న కేసులు పెరిగిపోతున్నాయి. భార్తలతో గొడవలు పడడం, కావాల్సిన దాని కోసం ఎదురు తిరగడం వంటి సమస్యలతో మానసిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

- Advertisement -

కోర్టులో ఇలాంటి కేసులకు తీర్పు చెప్పాల్సిన న్యాయమూర్తులు కూడా ఇటువంటి ఘటనలకు బలైపోతున్నారంటే నమ్మశక్యం కావడం లేదు. కానీ ఈ ఘటన గురించి తెలిస్తే నమ్మాలనిపిస్తుంది. కోర్టులో ఎన్నో విడాకులు కేసులు, భార్య భర్తల గొడవలు, కొట్లాటలు, ఆస్తులు వంటి కేసుల్లో తీర్పులు ఇచ్చిన ఓ న్యాయమూర్తి (జడ్జి) తనకు తానే ఉరిశిక్ష వేసుకున్నాడు. తరచూ ఎన్నో క్లిష్టమైన కేసులకు తీర్పు ఇచ్చే జడ్జి కూడా ఈ పరిస్థితికి బలికావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.

- Advertisement -

భార్య, భర్తల మధ్య ఏర్పడిన గొడవలతో న్యాయమూర్తి తనకు తానే ఉరిశిక్ష వేసుకున్నాడు. ఆదివారం మరోసారి భార్యభర్తలు గొడవ పడడంతో మణికంఠ ఉరివేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్ పోచమ్మ బస్తీ శ్రీనిధి రెసిడెన్సీలో వెలుగుచూసింది. మణికంఠ అనే వ్యక్తి నాంపల్లి కోర్టులో ఎక్సైజ్ మేజిస్ట్రేట్‌గా నిర్వహిస్తున్నారు. మణికంఠకు ఏడేళ్ల క్రితం మహబూబ్ నగర్‌కు చెందిన లలితతో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాయి. అయితే ఇద్దరి మధ్య గత రెండేళ్లుగా మనస్పర్థాలు ఏర్పడ్డాయి. దీంతో మణికంఠ, లలిత ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు. భార్య లలిత వాళ్ల అమ్మ వాళ్ల ఇంట్లో ఉండగా.. మణికంఠ శ్రీనిధి రెసిడెన్సీలోని తన ప్లాట్‌లో ఉంటున్నారు.

Also Read: EC New Rules for Elections: పార్టీలకు ఈసీ లేఖ.. 48 గంటల ముందు అప్లై, అలాగైతే ఛాన్స్ !

మణికంఠ తల్లి తాజాగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో మణికంఠ తండ్రి ఆసుపత్రిలోనే ఉంటూ తల్లిని చూసుకుంటున్నాడు. అయితే ఆదివారం మణికంఠ రెండేళ్లుగా దూరంగా ఉంటున్న భార్య లలితకు ఫోన్ చేశాడు. తన తల్లికి బాగోలేదని తాను రావాలని కోరాడు. ఈ క్రమంలో మరోసారి ఇద్దరు గొడవపడ్డారు. ఈ తరుణంలో తీవ్ర మనస్తాపానికి గురైన మణికంఠ భార్య చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మణికంఠ బయటకు రాకపోవడంతో ఇంట్లో వారు తపులు కొట్టారు. తెరవకపోవడంతో తలుపులు పగలగొట్టగా మణికంఠ చున్నీతో ఉరివేసుకుని ఫ్యాన్ కు వేలాడడం చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మణికంఠ తండ్రి ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News