BigTV English

Tragedy in Holi Celebrations: హోలీ వేడుకల్లో విషాదం.. మినీ వాటర్ ట్యాంక్ కూలి బాలిక మృతి!

Tragedy in Holi Celebrations: హోలీ వేడుకల్లో విషాదం.. మినీ వాటర్ ట్యాంక్ కూలి బాలిక మృతి!


Girl Died in Narayanapeta Holi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో హోలీ వేడుకలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి. హోలీ వేడుకల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లలో పిల్ల, పెద్ద అంతా కలిసి రెయిన్ డ్యాన్స్ లు చేస్తూ.. రంగులు పూసుకుంటా ఉత్సాహంగా గడుపుతున్నారు. ఎంతో ఆనందంగా జరుగుతున్న హోలీ వేడుకల్లో ఓ ఘటన తీరని విషాదాన్ని నింపింది. తెలంగాణలోని నారాయణపేట గోపాల్ పేట వీధిలో మంచినీటి ట్యాంక్ వద్ద చిన్నారులు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు.

ఒకరిపై ఒకరు రంగులు, రంగు నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న మినీ వాటర్ ట్యాంక్ కూలిపోయింది. ఆ ట్యాంక్ సిమెంట్ ముక్కలు చిన్నారులపై పడటంతో.. వారంతా గాయపడ్డారు. స్థానికులు వెంటనే గాయపడిన పిల్లల్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మీ ప్రణీత (12) అనే బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. హరిప్రియ అనే మరో చిన్నారికి కాలు విరిగింది.


Also Read: ఉరి వేసుకుని నాంపల్లి కోర్టు జడ్జి ఆత్మహత్య.. భార్యతో గొడవే కారణం..

ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంక్ ను పూర్తిగా తొలగించారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. రంగుల పండుగ వేళ బాలిక ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags

Related News

Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతవాసులు జాగ్రత్త..!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల

Nalgonda News: ఖరీదైన కార్లలో మేకలు, గొర్రెల దొంగతనం.. 16 మంది అరెస్ట్

Mehdipatnam accident: మెహదీపట్నం బస్టాప్‌లో RTC బస్సుకు మంటలు.. క్షణాల్లో బూడిద!

Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్

Mancherial Teacher: వెరైటీగా క్లాస్ కు వచ్చిన టీచర్.. విద్యార్థులు షాక్.. ఎక్కడంటే?

Big Stories

×