BigTV English

Telangana Thalli Statue: మరీ ఇంత దిగజారాలా.. ఛీ.. ఛీ.. ఆ పార్టీపై ఫైర్

Telangana Thalli Statue: మరీ ఇంత దిగజారాలా.. ఛీ.. ఛీ.. ఆ పార్టీపై ఫైర్

Telangana Thalli Statue: రాజకీయాలలో ఈ రాజకీయం వేరయా. ఎక్కడైనా విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. మరీ ఇంత దిగజారుడు తనమా.. ఇది కరెక్ట్ కాదు. నాడు ఒప్పుకున్నారు.. నేడు తప్పంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిన ఆ పార్టీ సాగిస్తున్న గ్లోబల్ ప్రచారానికి నెటిజన్స్ చురకలు అంటిస్తున్నారు. మీకు సమ్మతంగా ఉంటే ఒకలా.. లేకుంటే మరొక తీరు ప్రచారాలా.. ఇప్పటికైనా మారండి అంటూ నెటిజన్స్ ఆ పార్టీకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంతలా నెటిజన్స్ చేత విమర్శలు అందుకుంటున్న పార్టీ ఏదో కాదు బీఆర్ఎస్ పార్టీనే.


తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సంధర్భంగా విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంధర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం విడుదల చేసింది. అలా తెలంగాణ తల్లి విగ్రహ నమూనా బయటకు వచ్చిందో లేదో, బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారానికి తెర తీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి చిత్రాన్ని విడుదల చేశారు. ఎక్కడ కూడా తల్లి విగ్రహాన్ని మాత్రం ఏర్పాటు చేయలేదు. కేవలం చిత్రాన్ని మాత్రం విడుదల చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నారు కానీ, విగ్రహ ఏర్పాటు ఊసే లేదు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసింది. అంతేకాదు అక్కడ వాటర్ ఫౌంటైన్, పచ్చదనం ఒకటి కాదు ఎన్నో హంగులను దిద్దింది. ఈనెల 9న విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ తరుణంలో సోషల్ మీడియా వేదికగా తెలంగాణ కాంగ్రెస్ తల్లి అంటూ, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోటోలను ఉంచి మరీ దిగజారుడు రాజకీయాలను తలపించేలా ట్రోలింగ్ సాగుతోంది. ఇక్కడే పలువురు నెటిజన్స్, బీఆర్ఎస్ సోషల్ మీడియాకు ధీటుగా ప్రశ్నలు సంధిస్తున్నారు.


తల్లి తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు హోదాలో విజయశాంతి అలియాస్ రాములమ్మ 2007 జనవరి 25న యాదాద్రి జిల్లా రాజపేట మండలం బేగంపేటలో మొట్ట మొదటి తెలంగాణ తల్లి విగ్రహంను ఏర్పాటు చేశారు. ఈ తల్లి విగ్రహానికి కిరీటం లేదు.. నగలు లేవు.. తెలంగాణ తల్లి అంటేనే శాంతి స్వరూపిణి అనే రీతిలో నాడు ఏర్పాటు చేశారు. నాడు బీఆర్ఎస్ ఒక్క మాట ఎదురు చెప్పిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా విజయశాంతి ట్వీట్ చేసి చెప్పడం విశేషం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రాష్ట్ర తల్లి పేరిట విగ్రహస్థాపన చేస్తుంటే, ఓర్వలేక ఇష్టారీతిన ట్రోలింగ్స్ సాగించడంపై మరీ ఇంత దిగజారాలా.. అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నాడు విజయశాంతి ఏర్పాటు చేసిన విగ్రహం కూడా ఎటువంటి ఆడంబర నగలు, కిరీటం లేకుండా ఉన్న విషయాన్ని గమనించాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: CM Revanth Reddy: సైబర్ దాడులను ఎదుర్కొనేలా గూగుల్ సేఫ్టీ సెంటర్

కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ తల్లి నమూనా కూడా కాస్త అదే స్థాయిలో ఉన్నా, ఆశీర్వదించే రీతిలో చేయి ఏర్పాటు చేస్తే, హస్తం పార్టీ గుర్తుగా ప్రచారం చేయడం శోచనీయం. ఆశీర్వాదానికి, పార్టీ గుర్తుకు తేడా లేకుండా ప్రచారం సాగించడంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు నెటిజన్స్ చుక్కలు చూపిస్తున్నారు. రాజకీయాలు చేయాలి కానీ, ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు నెటిజన్స్. ఇప్పటికైనా ఈ ప్రచారాలకు, ట్రోలింగ్స్ కి బీఆర్ఎస్ పెద్దలు శుభం కార్డు వేయాలని, ఇటువంటి వాటిని తెలంగాణ సమాజం హర్షించదని ప్రజలు కోరుతున్నారు.

Related News

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Former DSP Nalini Health: చావుకు ద‌గ్గ‌ర్లో ఉన్నా!! క్రిటిక‌ల్‌గా Ex డీఎస్పీ నళిని హెల్త్ కండీష‌న్‌

OG Pre-release Event: ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎల్బీ స్టేడియం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad News: హైడ్రా కూల్చివేతలు.. గాజులరామారం వంతు, వేల కోట్ల భూమి సేఫ్

Telangana govt: వచ్చేవారం నోటిఫికేషన్? స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ చర్చ

Hyderabad Skywalk: హైదరాబాద్‌లో మరో రెండు స్కైవాక్ లు.. ఈ ఏరియాల్లో ప్రజల కష్టాలు తీరినట్లే!

Big Stories

×