E-Paper
Advertisement

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ
Advertisement

Comedy Movie: రైల్లో ప్రయాణం అంటే సరదా… కానీ ఈ ట్రైన్‌ లోకి ఎక్కిన వాళ్ళంతా చనిపోయే సిట్యుయేషన్ వస్తే…. ఇద్దరు ఉద్యోగాలు పోగొట్టుకున్న అమ్మాయిలు సరదా కోసం ఓ లగ్జరీ ట్రైన్ ఎక్కుతారు. అక్కడ చిన్న చిన్న గొడవలు మొదలైన కొద్దిసేపటికే… బయట ఓ భారీ విపత్తు వాళ్లందరినీ చుట్టుముడుతుంది. ఇక ఒకరినొకరు చూసి ఓర్వలేని వాళ్లే కలిసి ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తుంది. యాక్షన్, కామెడీ, డిజాస్టర్ కలిసిన ‘స్టాప్! దట్! ట్రైన్!’ (Stop! That! Train!) మూవీ స్టోరీ ఇదే. మరి ఈ మూవీని స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

కథలోకి వెళ్తే…

టెస్, డీడీ ఇద్దరూ ట్రాన్సిట్ స్టీవర్డెస్‌లుగా పని చేస్తుంటారు. వాళ్లకు సంబంధించిన ట్రాన్సిట్ లైన్ మూసివేయడంతో ఇద్దరూ ఉద్యోగాలు కోల్పోతారు. కానీ ఉద్యోగం పోయిందని వాళ్ల లైఫ్ స్టైల్ ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఆ సరదా జీవితాన్ని కొనసాగించేందుకు ఇద్దరూ గ్లామజోనియన్ ఎక్స్‌ప్రెస్ అనే అత్యంత విలాసవంతమైన ట్రైన్‌ లోకి రహస్యంగా ఎక్కుతారు. అక్కడ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు, సిబ్బందితో వాళ్లకు మొదటి నుంచే గొడవలు మొదలవుతాయి.

Advertisement

టెస్, డీడీ ఒక వైపు… ఫస్ట్ క్లాస్ వాళ్లు మరోవైపు. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారుతుంటాయి. ట్రైన్‌ లోని ప్రయాణికులు ఎవరికి వారే అన్నట్టుగా ఉంటారు. కానీ వాళ్లందరి మధ్య ఉన్న ఈ గొడవలు ఎక్కువసేపు కొనసాగవు. ఎందుకంటే ట్రైన్ ఓ భారీ వాతావరణ విపత్తు వైపు దూసుకెళ్తుంది. ‘స్టార్మగాంజా (Stormaganza)’గా పిలిచే ఈ విపత్తు కారణంగా ప్రయాణికులందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. అప్పటివరకు ఒకరితో ఒకరు గొడవపడిన వాళ్లే ఇప్పుడు కలిసి పని చేయాల్సి వస్తుంది.

ట్రైన్‌ లోని సిబ్బంది, ప్రయాణికులు మాత్రమే కాదు… అమెరికా అధ్యక్షుడు గ్యాగ్‌వెల్ కూడా అదే ట్రైన్ లో ఉంటాడు. అంటే అతని ప్రాణాలు కూడా డేంజర్ లో ఉన్నట్టే. ట్రైన్‌ ను రక్షించడం, ప్రయాణికులను కాపాడటం కోసం వాళ్లంతా కలిసి ఓ మార్గం వెతకాల్సి వస్తుంది. ప్రమాదం పెరుగుతున్న కొద్దీ వాళ్ల మధ్య ఉన్న గొడవలు కూడా విచిత్రమైన కామెడీగా మారతాయి. పరిస్థితి ఎంత సీరియస్‌ గా ఉన్నా టెస్, డీడీ చేసే పనులు, ఫస్ట్ క్లాస్ వాళ్ల ప్రవర్తన నవ్వు తెప్పిస్తాయి. యాక్షన్, డిజాస్టర్ సన్నివేశాల మధ్య ఈ కామెడీనే సినిమాకు ప్రత్యేకమైన టచ్ ఇస్తుంది. మరి చివరకు ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొన్నారు ? చివరికి కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది తెలియాలంటే సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.

నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో చూడొచ్చా ?

Advertisement

ఈ ఏడాది జూన్ 12న అమెరికాలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్‌ కు వస్తోంది. ఇందులో జింజర్ మింజ్, రూపాల్ చార్ల్స్, సారా మిషెల్ గెల్లర్, జెస్సీ టైలర్ ఫెర్గూసన్, జోయెల్ మెక్‌హేల్ తదితరులు నటించారు. ఆడమ్ షాంక్‌మన్ (Adam Shankman) దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీ ఓటీటీలో తెలుగులో లేదు.

Read Also: మొగుడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ప్రియుడితో… ఈ కొరియన్ సిరీస్ లో ఒక్కో సీన్ ఉంటది భయ్యా

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×