E-Paper
Advertisement

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే

3 ఏళ్ల బాబు మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. కిడ్నాప్ చేసింది వాళ్లే
Advertisement

Nizamabad Child Kidnap:మాతాశిశు ఆస్పత్రి పరిసరాల్లో మూడేళ్ల చిన్నారి వేదాన్ష్ అదృశ్యమైన ఘటన నిజామాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది.బాబు కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

మరోవైపు చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు రంగంలోకి దిగడంతో చిన్నారి వేదాన్ష్ ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.మొత్తానికి పోలీసుల గాలింపు చర్యలు ఫలించి . కిడ్నాప్‌కు గురైన వేదాన్ష్‌ను పోలీసులు సురక్షితంగా రక్షించడం తో కథ సుఖాంతం అయింది.

Advertisement

అయితే వేదాన్ష్‌ను ఒక జంట కలిసి కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముందుగా చిన్నారి కదలికలను గమనించిన నిందితులు.. పక్కా ప్లాన్‌తోనే అతడిని తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానించారు. గంటల తరబడి పరిసరాల్లో రెక్కీ చేసిన తర్వాత బాలుడిని ఎత్తుకెళ్లినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.

సీసీ కెమెరాలతో బయటపడిన కీలక ఆధారాలు

Advertisement

ముందుగా బాబు తప్పిపోయాడన్న ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముందుగా ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఓ మహిళ చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు పోలీసుల కంట పడ్డాయి.ఆ తర్వాత మరో వ్యక్తి కూడా ఆమెతో కలిసి ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.

పులాంగ్ ప్రాంతంలో అదే జంట ఆటో నుంచి దిగిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం. ఈ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కదలికలను ట్రాక్ చేసినట్లు తెలుస్తోంది. వారు కామారెడ్డి వైపు వెళ్లి ఉండొచ్చన్న అనుమానంతో ఆ దిశగా కూడా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.

ఎనిమిది ప్రత్యేక బృందాలతో వేట

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో కేసును సీరియస్‌గా తీసుకున్న నిజామాబాద్ పోలీసులు ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. డీఎస్పీ స్థాయిలో కూడా తనిఖీలు కొనసాగించారు. ఏసీపీ శ్రీశైలం ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి నిందితుల కోసం విస్తృతంగా గాలించారు.

మొత్తానికి పోలీసుల దర్యాప్తు వేగం పెంచడంలో కేసులో కథలిక వచ్చింది.చివరగా మహిళతో పాటు మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని . వారి వద్ద నుంచి చిన్నారి వేదాన్ష్‌ను సురక్షితంగా రక్షించడం తో ఊపిరి పీల్చుకున్నారు తల్లి తండ్రులు.

ఇదిలా ఉంటే ఈ కిడ్నాప్ ఘటనలో ఆస్పత్రి వద్ద సీసీ కెమెరాల నిర్వహణపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని కెమెరాలు సరిగా పనిచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న ఫుటేజీ ఆధారంగానే పోలీసులు కేసును ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

కేసును ఛేదించిన పోలీసులు

ఇక  కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ ప్రాంతంలో నిందితులు సుజాత, ఎల్లమ్మను అదుపులోకి తీసుకున్నారు. నిజాంపేట్ గ్రామానికి చెందిన వారిగా వారిని గుర్తించారు.

చాక్లెట్ ఆశ చూపించి ఆసుపత్రి నుంచి కేవలం మూడు నిమిషాల్లోనే బాలుడిని ఎత్తుకుని పోయినట్టు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు

Also read :తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

 

Tags

Related News

మీ కోడళ్లకు ఇలాగే జరిగితే ఊరుకుంటారా.. డీజీపీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు!

అసెంబ్లీ సమావేశాల వేళ రేవంత్ సర్కార్‌కు బిగ్ షాక్.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

నకిలీ హిజ్రా మాఫియా పై డీజీపీ ఉక్కుపాదం.. సంచలన ఆదేశాలు జారీ!

తల్లి పదవి పోయిందని సుస్మిత ఏడుపు.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్

జూబ్లీహిల్స్ కారా కారా పబ్బులో యువకులు హల్చల్.. పబ్ గొడవలో ఓ కాంగ్రెస్ ఎంపీ కుమారుడు?

పగలు రైతుల వేషం.. రాత్రి వేళ మోటార్ల చోరీ.. జనగామలో దొంగల ముఠా అరెస్ట్!

Big Stories

Advertisement
×