Hyderabad : హైదరాబాద్‌లో సెకెండ్ హ్యాండ్ బైక్, కార్ కొంటున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీరు కట్టిన డబ్బులన్నీ వ్యర్ధం కావడమే కాకుండా మీరు కొన్న వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశే అవకాశం ఉంది. వాహనాల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కొందరు సెకెండ్ హ్యండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతర్రాష్ట్రదొంగలు బైకులను, కార్లను దొంగలించి ప్లేట్లు మార్చి నకిలీ పత్రాలతో అమ్మేస్తున్నారు. కొనే ముందు మొత్తం వెరిఫికేషన్ చేసుకోని కొనుగోలుదారులు ఆ తరువాత తీవ్ర నష్టపోతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో సెకెండ్ హ్యాండ్ వాహనాలను కొన్నవారు మళ్లీ తెలంగానలో ప్రత్యేకంగా రిజిస్ట్రీషన్స్, రోడ్ టాక్స్ చేయించుకోవాలి.. లేదంటే మొత్తం వాహనాన్ని స్వాధీనం చేసుకొనే అధికారం ఆర్టీఏ అధికారులకు ఉంటుంది. ఏపీ వాహనాలు తెలంగాణలో తిరిగితే వాటికి టీఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అదే వాహనాలు తెలంగాణలో కొన్ని ఏళ్లు తిగిరి మళ్లీ ఏపీకి వెళ్తే.. అక్కడ టీఎస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది. వాహనం ఏ రాష్ట్రానిదైనా.. అది ఉన్న రాష్ట్రానికి పన్ను కట్టాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.