Palvai Sravanthi : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి.. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఫుల్ జోష్‌గా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీ, రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అమ్మలాంటిది.. అలాంటి అమ్మలాంటి పార్టీని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీడి కాంట్రాక్టుల కోసం బీజేపీలో చేరారన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంతకు అమ్ముడుపోయారో ప్రజలందరికీ తెలుసన్నారు. రాబోయే ఉపఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెబుతారన్నారు.
తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి సొంత బిడ్డలా చూసుకున్నాడని గుర్తి చేశారు పాల్వాయి స్రవంతి. మునుగోడు అభివృద్ధికి తన నాన్న (పాల్వాయి గోవర్ధన్ రెడ్డి) ఎంతో కృషిచేసినట్లు చెప్పారు. ఎన్నికల్లో వేరే పార్టీ అభ్యర్ధులు ఖర్చు పెట్టే దాంట్లో సగం కూడా తన నాన్న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఖచ్చు పెట్టేవారు కాదన్నారు ఆయన కూతరు పాల్వాయి స్రవంతి. తనకు మునుగోడు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే.. తన నాన్న బాటలోనే నడుస్తానని హామీ ఇస్తోంది.
మునుగోడు ఎన్నికల్లో విజయం సాధిస్తామని బీజేపీ కలలు కంటోందన్నారు. ఈటెల రాజేందర్ విజయాలని తమ విజయాలుగా చెప్పుకుంటూ బీజేపీ పార్టీ బలపడుతోందనే భ్రమలో ఉన్నట్లు చెప్పారు. ఇక మునుగోడు నియోజకవర్గాన్ని ఇప్పుటి వరకు పట్టించుకోని టీఆర్ఎస్.. ఎన్నికలు రాగానే ప్రజలు గుర్తుకువచ్చారని విమర్శించారు.