KTR : మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో అదానీ, మరికొంతమందికి మాత్రమే అఛ్ఛేదిన్ వచ్చాయని మిగిలినవారందరికీ విషద రోజులే మిగిలాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సెటైర్ విసిరారు. ప్రపంచ ఆకలి సూచికలో భారత్ 107 స్థానంలో ఉంటే.. ప్రపంచ కుబేరుల్లో అదానీ రెండవ స్థానంలో ఉండడం భారత్ పతనానికి నిదర్శనమన్నారు. ఈ ఘనత సాధించింది ప్రధానీ మోదీయేనని వ్యంగ్యం అన్నారు.
గచ్చిబౌలిలో ఓ చిన్న చెరువును చూపిస్తూ విరాజ్ అనే బాలుడు.. ప్రకృతిని కాపాడండి.. ఈ చెరువును పరిరక్షిండి అని వీడియోలో చెప్పాడు. సదరు వీడియోన బాలుడి నాన్న ప్రశాంత్ అగర్వాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మంత్రి కేటీఆర్ ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ.. బాలుడిని ఓసారి కలిపిస్తే ఆ అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకుంటానని బాలుడి తండ్రికి సూచించారు.
కామారెడ్డిలో పురాతనమైన నాగన్నపేట బావిని యోగా కేంద్రంగా మార్చారు కస్తూర్బా విద్యార్ధులు. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను చూసి మంత్రి కేటీఆర్ ప్రశంసలు గుప్పించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మంత్రి ప్రోత్సహించారు.